
Palawan Ferry Accident : ఘోరప్రమాదం.. నడి సముద్రంలో పడవలో మంటలు.. పలువురు మృతి, 87మంది ఆచూకీ గల్లంతు..
Palawan Ferry Accident : ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 87మంది ఆచూకీ గల్లంతైంది
© 2026 nimisham.in

Palawan Ferry Accident : ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 87మంది ఆచూకీ గల్లంతైంది

ఏడు వారాల జైలు జీవితంలోనే బాధితుడు ఏకంగా 21 కిలోల బరువు తగ్గడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడాన్ని కోర్టు(Bombay High Court) తీవ్రంగా పరిగణించింది.

Heart Attack | మహిళల్లో గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. ఇవి కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి... బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

ఇంటికి అడుగుల దూరంలోనే.. ఒక్కసారిగా పిడుగు పడి ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ భయానక క్షణాలు ఇంటి డోర్‌బెల్ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటనలో థామస్ ఫహ్మీ ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన శరీరమంతా ఒక్కసారిగా తీవ్రమైన విద్యుత్ షాక్ వ్యాపించినట్లు అనిపించిందని.. మొద్దుబారడం, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించాయని ఆయన తెలిపారు. స్టాటెన్ ఐలాండ్‌లో నివసించే థామస్ ఫహ్మీ గత గురువారం దంత వైద్యుడి వద్దకు వెళ్లేందుకు తన ఇంటి నుంచి కారువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. విండ్సర్ రోడ్ సమీపంలో తన కారుకు సుమారు 15 నుంచి 25 అడుగుల దూరంలో ఉండగా ఒక్కసారిగా ఆయన పాదానికి పిడుగు తాకింది. డోర్‌బెల్ కెమెరాలో నమోదైన వీడియోలో పిడుగు తాకిన వెంటనే ఫహ్మీ నేలపై పడిపోవడం కనిపించింది. అయితే ఆయన స్పృహ కోల్పోలేదు. తన శరీరమంతా తీవ్రమైన షాక్‌కు గురైనట్లు, ముఖ్యంగా రెండు పాదాల్లో తీవ్రమైన నొప్పి, మంట మొద్దుబారినట్లు ఫహ్మీ చెప్పారు. పిడుగు ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఫహ్మీ తిరిగి లేచి.. సహాయం కోసం సమీపంలోని ఇంటివైపు నడుచుకుంటూ వెళ్లారు. నాకు సాయం చేయండనే0 అరుపు వినిపించింది. వెంటనే నా తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే ఆయన నేలపై పడి ఉన్నారని పొరుగింటి మహిళ స్టెఫానీ హోమన్ తెలిపారు. అనంతరం ఫహ్మీని నార్త్‌వెల్ స్టాటెన్ ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరుసటి రోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆశ్చర్యకరంగా.. ఆయనకు ఎలాంటి కాలిన గాయాలు లేవని వైద్యులు గుర్తించారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tiger suddenly attacks on zookeeper video: సాధారణంగా జూలల్లో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని శాఖాహర జంతువులు, మరికొన్ని మాంసాహర జంతువులు ఉంటాయి. అయితే.. జూ సిబ్బంది వాటికి చక్కగా ట్రైన్ చేస్తారు. క్రూర జంతువులను సైతం తమ దారిలో తెచ్చుకుంటాయి. ఆ తర్వాత అవి జూ సిబ్బంది చెప్పినట్లు వింటాయి. కానీ కొన్నిసార్లు జూలోని జంతువులు సిబ్బందిపై ఎదురు తిరిగి దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో జూ సిబ్బంది తమ ప్రాణాలను సైతం కొల్పోతారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒక జూ ఎన్ క్లోజర్ లో పెద్దపులి జూ సిబ్బందిపై క్రూరంగా దాడి చేసింది.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో.. ఎన్ క్లోజర్ లో కొన్ని పెద్దపులులు ఉన్నాయి. ఇంతలో వాటిని ఆహరం వేద్దామని నెమ్మదిగా జూ సిబ్బంది దానిలోకి ప్రవేశించాడు. మరీ దానికి ఏమనిపించిందో ఏంటో కానీ ఒక్కసారిగా పెద్దపులి జూ కీపర్ పై దాడి చేసింది. ఈ ఘటనతో అతను షాక్ కు గురయ్యాడు. పులి అతని మెడను గట్టిగా పట్టుకుని పలు మార్లు తన పంజాతో దాడి చేసింది. ఇంతలో అక్కడున్న జూ కీపర్ పెంపుడు శునకం పెద్దపులిపై దాడికి దిగింది. దీంతో పులి కాస్త జూ కీపర్ ను వదిలేసింది. ఆ పెనుగులాటలో మరో జూ కీపర్ చాకచక్యంగా ప్రవర్తించి, గాయపడ్డ సిబ్బందిని బైటకు లాక్కున్నాడు. కుక్క మాత్రం పులితో పొరాటంకు దిగింది. Read more: Snake

ఒకప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకున్న న్యాయవాదులకు (Lawyers) ఇప్పుడు దాడులు స్వాగతం పలుకుతున్నాయి. వారు వాదిస్తున్న కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వారు, విచారణలను తప్పుదోవ పట్టించేలా లాయర్లపై ఒత్తిళ్లు తీసుకోవడం, కుదరకపోతే దాడులకు దిగడం చూస్తూనే ఉన్నాం. వీటిని అరికట్టేందుకు కఠిన చట్టాల అవసరం ఉందని న్యాయస్థానాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాయర్లపై దాడులకు దిగితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా గోవా ప్రభుత్వం అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టింది.ఏపీ మద్యం స్కాం- సిట్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం- రెండేళ్లయినా ఏమీ దొరకలేదు..!విధి నిర్వహణలో ఉన్న లాయర్లపై దాడి చేసిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాతో సహా కఠినమైన శిక్షలను నిర్దేశించే బిల్లుకు ఇవాళ గోవా అసెంబ్లీ ఆమోదించింది. గోవా న్యాయవాదుల రక్షణ బిల్లు 2026పేరుతో తెచ్చిన ఈ బిల్లులో బెదిరింపులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు పోలీసు రక్షణ కల్పించడం, దుర్వినియోగానికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు కూడా ఉన్నాయి. లాయర్లపై తప్పుడు లేదా దురుద్దేశపూర్వక ఫిర్యాదులు చేసిన వారికి ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఈ బిల్లు చెబుతోంది. సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!న్యాయ, చట్ట, న్యాయవ్యవస్థ శాఖను కూడా నిర్వహిస్తున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది.లాయర్లు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు వారిపై హింస, బెదిరింపులు, వేధింపులు, తప్పుడు ఆరోపణలు, ఆస్తి నష్టం వంటి ఘటనలు పెరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు న్యాయవాద వృత్తి యొక్క స్వాతంత్రాన్ని, నిర్భయ పనితీరును ప్రభావితం చేస్తాయని, కక్షిదారుల న్యాయ ప్రాతినిధ్య హక్కును, న్యాయం పొందే అవకాశాన్ని దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. ఈ చట్టం ప్రకారం న్యాయవాదిపై దాడి చేసినా లేదా నేరపూరిత బలప్రయోగం చేసినా రెండు సంవత్సరాల

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ

ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన దగ్గరి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగుపయనమైంది. అందులో 5000 మందివరకు యూఎస్ నావికులు, మెరైనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు (US sailors Thailand). 200 రోజులకు పైగా వారు జలాల్లోనే ఉండటంతో కనీస సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ నౌక థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చేరనుంది. ఇలాంటి సమయంలో నగరంలోని సెక్స్‌వర్కర్లను (Pattaya sex workers) లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో పట్టాయా నగరం ఉంటుంది. ఈ సిటీ నైట్‌లైఫ్, బీచ్‌లకు ఫేమస్. ఇప్పుడు దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని లేమ్ చాబాంగ్ పోర్టు వద్ద యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ లంగరు వేయనుంది. ఇంతకాలం గల్ఫ్జలాల్లో విధులు నిర్వర్తించడం ఆ నౌక చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు అది వెనక్కి వచ్చిన తర్వాత నావికులు, మెరైనర్లు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వనున్నారు (US Navy Thailand visit). దీంతో ఈ నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచ్‌ల సమీపంలో, నైట్ లైఫ్ ఏరియాల్లో పెట్రోలింగ్‌ను పెంచారు. గత వారాంతంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నౌక వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని చెప్పడం కష్టమని పోలీసులు వెల్లడించారు (Pattaya crackdown). ఇలాంటి నౌకల రాకతో ఇదొక ప్రతికూల అంశమే అయినా.. ఆర్థికంగా పట్టాయాకు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ నగరం ప్రధానంగా పర్యాటకం, వినోదరంగంపైనే ఆధారపడింది. అలాగే హోటళ్లు, రెస్టారంట్లు, బార్లు, దుకాణాలు, ఇతర వ్యాపారాలు మరింత లాభసాటిగా మారతాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. వ్యభిచారం థాయ్‌లాండ్‌లో చట్టవిరుద్ధం. కానీ

న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ కూడలిలో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన మహిళను బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటిగా అధికారులు గుర్తించారు. మంగళవారం ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. క్వీన్స్‌కు చెందిన ఓ 49 ఏళ్ల మహిళ టైమ్స్ స్క్వేర్ వద్దకు రెండు కత్తులతో వచ్చి అక్కడున్న ఎరిన్‌తో పాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచింది. ఈ ఘటనలో ఎరిన్ కన్నుమూశారు. తీవ్రగాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న ఎరిన్ ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు. ఇంతలో అనూహ్యంగా ఆమె మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎరిన్ మృతిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్‌లో రెండో అతిపెద్ద బ్యాంకు అన్న విషయం తెలిసిందే. కత్తులతో దాడికి పాల్పడ్డ మహిళ కూడా పోలీసు కాల్పుల్లో కన్నుమూసింది. ఆమెను పామెలా సిస్నెరోస్‌గా (49) పోలీసులు గుర్తించారు. పామెలాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు తెలిపారు. గతంలో ఓసారి ఆమెపై ఫిర్యాదు వచ్చినా కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పారు. పామెలా దశాబ్దాలుగా మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె సోదరుడు చెప్పాడు. అయితే, ఇప్పటివరకూ ఏనాడు ఆమె హింసాత్మక ధోరణి కనబరచలేదని అన్నాడు. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. నేపాల్‌ను వణికిస్తున్న వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు.. అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు.. చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అత్యంత ఉద్రిక్త రూపం దాల్చింది. రష్యాపై మునుపెన్నడూ లేని రీతిలో అతిపెద్ద డ్రోన్ దాడులు చేయడానికి సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఏ క్షణంలోనైనా ఈ దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రష్యా గగనతలం పౌర విమానయానానికి ఎంతమాత్రం సురక్షితం కాదని, మాస్కోలోని విమానాశ్రయాలు కూడా తమ లక్ష్యాలలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఈ బహిరంగ హెచ్చరిక జారీ చేశామని, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ఆ ప్రాంతంలో ప్రయాణాలను తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా స్వయంగా ప్రారంభించిన యుద్ధం వల్లే నేడు ఆ దేశానికి ఈ దుస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ చేసిన ఈ బహిరంగ హెచ్చరికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ వైఖరి ఉగ్రవాదుల తీరును తలపిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయంగా తమపై ఎంత ఒత్తిడి వచ్చినా, ఉగ్రవాద తరహా చర్యలకు పాల్పడుతున్నవారితో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తెగేసి చెప్పారు. ఈ పరిణామాల మధ్యనే మంగళవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన విధ్వంసకర దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు ఈ యుద్ధంలో మృతి చెందినట్లు వెలువడిన వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి

ప్రపంచదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలం దాదాపుగా మూతబడినట్టేనని చెప్పారు. ఆవైపు వెళ్లొద్దని హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేమేమీ పౌర విమానయాన సంస్థలను టార్గెట్ చేయడం లేదు. కానీ రష్యా గగనతలంలో భారీ స్థాయిలో డ్రోన్స్ ఉండటం వల్ల రిస్క్‌ను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. రష్యా ప్రారంభించిన యుద్ధం వల్ల ఆ దేశ గగనతలమే మూత పడే స్థితి వచ్చిందని చెప్పారు. సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో వంటి నగరాల గగనతలంలో విమానాలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అద్యక్షుడి వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అవి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. తామూ ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా పుతిన్ ఉక్రెయిన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు చర్చలకు సిద్ధమేనని అంటున్నారు. కానీ ఉగ్రవాదులతో ఎలాంటి చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పాశ్చాత్య దేశాల ఎయిర్‌లైన్స్ ఇప్పటికే రష్యాకు విమానాల రాకపోకలను నిలిపివేశాయి. చైనా ఎయిర్‌లైన్స్ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇక రష్యా గగనతలంలో పౌర ఎయిర్‌లైన్స్ సంస్థలకు రిస్క్ ఉందని పౌరవిమానయాన రంగ కన్సల్టెన్సీ సంస్థ ఆస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది. ప్రస్తుతం, రష్యా సరిహద్దుకు 300 కిలోమీటర్ల లోపల వరకూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్‌పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు సెప్టెంబర్ 1న దాడులు పూర్తి చేశాయి. నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ ప్రత్యక్ష సైనిక ఘర్షణ మొదలైంది. అమెరికా వైమానిక దళాలు ఇరాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్, రాడార్ వ్యవస్థలు, మైన్-లేయింగ్ సామర్థ్యాలు మరియు మెరైటైమ్ అసెట్స్‌పై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్ హర్ముజ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యూహాత్మక దాడుల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఇదిలా ఉండగా జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ బలగాలు వరుసగా బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేశాయి. ఈ చర్యలకు తగిన ప్రతీకారం తీర్చుకునే క్రమంలోనే ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ వైమానిక దాడుల ఫలితంగా ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ గండి పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు మరియు సముద్ర ఆధారిత దాడుల సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన ట్రంప్ అమెరికా చేసిన దాడులు చాలా పెద్దవి మరియు అత్యంత శక్తివంతమైనవి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కనుక మళ్లీ ప్రతీకార చర్యలకు దిగితే మునుపటికంటే మరింత భారీగా కొడతామని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వైఖరి పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలను అణచివేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇరాన్ స్థానిక మీడియా ఈ దాడులపై తీవ్ర నిరసన వ్యక్తం

పరకాల నెత్తుటి త్యాగానికి 75 ఏళ్లు రజాకార్ల దాడుల్లో నేలకొరిగిన యోధులు మరో జలియన్‌వాలాబాగ్ ఘటనగా ప్రసిద్ధి పరకాల(వరంగల్): రజాకారుల పాశవిక దాడికి పరకాలలో 15 మంది సమరయోధులు అమరులైన ఉదంతానికి నేటితో (సెప్టెంబరు 2) 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి చెంది ఆగస్టు 15 స్వేచ్ఛా స్వాతంత్య్రం పొందితే.. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించలేదు. స్వేచ్ఛా స్వాంతంత్య్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమం వైపు ఉరుకులు తీశారు. ప్రజా సంఘాలు, సాయుధ బలగాలను ఏర్పా టు చేసుకుని సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. నిజాం సర్కారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరిట ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరు ఉద్యమకారులను, సానుభూతిపరుల కుటుంబాలను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. రజాకారుల చర్యలను ఎదుర్కొనేందు కు సమరయోధులు సాయుధబాట పట్టారు. పరకా ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కటంగూరి కేశవరెడ్డి, ప్రకా్‌షరెడ్డి, ఎస్.మనోహర్‌రావు, కటంగూరి నర్సింహరెడ్డి, వీరగోపాల్‌రావు, చాడ వాసుదేవరెడ్డి, బల్గూరి బుచ్చయ్య, తోపునూరి కోటయ్య, కందుకూ రి జోగారెడ్డి, మేడిపల్లి మల్లయ్య, పాడి నర్సింహారెడ్డి, చంద్రయ్య, చిట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి పోరాటయోధులు ఒక్కొక్క విభాగానికి నాయకత్వం తీసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 1947 సెప్టెంబరు 2న పరకాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి పరకాల ప్రాంతంలోని ప్రతీ గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని చాపలబండ వద్దకు చేరుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పరకాలప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచాలని అప్ప టికే పధకం ప్రకారం నిజాంసేనలు మాటువేసి ఉన్నాయి. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వరకు ప్రజలు చేరగానే రజాకార్ మూకలు కత్తులు, బరిసెలు, తల్వార్లతో ఉద్యమకారులను వెంబడించి ఊచకోత కోయగా, నిజాం ఆధీనంలోని పోలీసులు తుపాకులతో విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 15

మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది. తమపై దాడులకు తెగబడుతున్న అమెరికా చివరకు పశ్చాత్తాపం చెందక తప్పదని ఇరాన్ సైనిక దళం ఐఆర్జీసీ హెచ్చరించింది. హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది. ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మూడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది. అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల లాగా తాము సామాన్య పౌరులను ఏనాడు టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man dangerous stunts with venomous snakes video: పాములను చూసి ప్రాణాల మీద తీపి ఉన్న వారు భయంతో పారిపోతారు. కానీ మరికొంత మంది మాత్రం వాటితో స్టంట్ లు చేస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో పాముల వీడియోలు కుప్పలుతెప్పలుగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. కోబ్రాలు కాటు వేస్తే కొంత మంది సైకొలుగా ప్రవర్తిస్తున్నారు. వాటిని పట్టుకుని కొరకడం లేదా దాడి చేయడం చేస్తున్నారు. అంతే కాకుండా వాటిని మెడలో వేసుకొవడం, డబ్బాలో పట్టుకుని నేరుగా డాక్టర్ల వద్దకు తీసుకొనివెళ్లడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం మనం వార్తలలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాము వీడియో నెట్టింట బాగా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో మూడు పాములు ఉన్నాయి. వాటిని ఒక స్నేక్ క్యాచర్ చేతికి గ్లౌజ్ లు వేసుకుని మరీ పదేపదే వాటితో రీల్ లు చేస్తున్నాడు. అవి కోపంతో అతనిపైకి దాడి చేస్తున్నాయి. అతను మాత్రం భయపడకుండావాటిని భయపెట్టడం చేస్తున్నాడు. పాములు కోపంతో బుసలు కొడుతూ తమనే తాకుతావా..అంటూ ఫైర్ అవుతున్నాయి. చేతికి వేసుకున్న గ్లౌజ్ ల మీద కాటు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ అతను చాకచక్యంగా పాముల కాటునుంచి బైటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. Read more: Snakes mating Video: చీర మీద ఒకదానితో మరోకటి జతకడుతున్న రెండు పాములు.. అరుదైన వీడియో.. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నారు

రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్లు, మిసైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టిందని అన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక ఆగస్టు 31 సోమవారం కూడా ఉక్రెయిన్ లోని ఒడెసా నగరంపై రష్యా దాడులు చేసింది. ఏరియల్ బాంబ్స్, డ్రోన్ లతో విరుచుకుపడింది. దాంతో నగరంలోని వేలాది కుటుంబాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే గడిపాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. ఇక తాజాగా జరిగిన దాడిలో 12 మంది మృతి చెందారని.. వారిలో ఒకరు భారతీయుడని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఒడేసా, ఖేర్సన్, డొనెట్స్క్, జపోరిజియా, ఖార్కివ్, చెర్నిహివ్, జైటోమిర్, సుమీ అలాగే డినిప్రోలపై రష్యా చేపట్టిన దాడుల్లో డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడినట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కీవ్ నగరంలోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే ఈ దాడులకు బోరీస్పిల్ ప్రాంతంలోని ఐదంతుస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. ఇక 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అని అధికారులు తెలిపారు. కీవ్ నగరంలో 350 మందితో కూడిన రెస్క్యూ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని అన్నారు

Sircilla: నాంపల్లి బీజేపీ ఆఫీసుపై దాడికి నిరసనగా సిరిసిల్లలో ఉద్రిక్తత! Sircilla: నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ నాయకులు అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరే ఇలా దాడులకు పాల్పడితే.. 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్న తాము దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు, సెప్టెంబర్ 01: నగరంలోని దారుణ హత్యకు గురైన రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు స్నేహితుల మధ్య పాత గొడవలు, విభేదాలే కారణమని తేల్చారు. వీరంతా మద్యం సేవించే సమయంలో సాయితేజ తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు. ఈ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, సైబర్ టెక్నాలజీ, సీసీటీవీ ఫూటేజీతోపాటు అనుమానితుల కదలికలపై నిఘాతో నిందితులను వెంటనే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేవలం 24 గంటల్లో ఈ కేసు ఛేదించిన డీఎస్పీలు గిరిధర్, జి. శ్రీనివాసరావు, సీఐ సీతారామయ్యతోపాటు సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అభినందించారు. శాంతిభద్రతలకి విఘాతం కలిగించినా, నేరాలకి పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ప్రజలను ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. నగరంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు

Sircilla: కర్రీ అడిగేందుకు వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నంలోకి కర్రీ కోసం పక్కింటికి వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్‌కు చెందిన మోతె రాజు అన్నంలోకి కర్రీ కోసం పక్కింట్లోని మామిడాల రాజు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని మామిడాల రాజు, అతని తల్లి అక్కవ్వ తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని మోతె రాజు తల్లి ఆరోపించారు. గొడ్డలితో దాడి చేయడంతో మోతె రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం

సాక్షి, గుంటూరు: గుంటూరులో మరోసారి టీడీపీ గూండాలు బరితెగించారు. కానిస్టేబుల్‌పై టీడీపీ నేత అశోక్, అనుచరులు దాడి చేశారు. బస్టాండ్‌లో పిల్లర్లు ధ్వంసం చేసేందుకు యత్నించిన టీడీపీ మూకలను కానిస్టేబుల్ ఠాగూర్ అడ్డుకున్నారు. కానిస్టేబుల్‌ను వెంటాడి మరీ టీడీపీ గూండాలు దాడి చేశారు. తిరిగి కానిస్టేబుల్‌పైనే అశోక్ తప్పుడు ఫిర్యాదు చేశారు. అశోక్‌పై కేసు కట్టకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు.. తన ఫోన్‌ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు.. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం

గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. పెల్లెట్‌గన్ దాడిలో గాయపడిన విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని 19 ఏళ్ల వయసున్న విద్యార్థి సాహిల్ లోచబ్, అతని తల్లి ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ.. పోలీసులు నమోదు చేయకపోవటంతో ఆ విషయాన్ని వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారితో కలిసి రాహుల్ శుక్రవారం.. మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పెల్లెట్‌గన్ దాడిలో లోచబ్ కంటికి మూడు పెల్లెట్లు తగిలాయని, దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి వెళ్లాయని, గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదం అని వైద్యులు వాటిని తీయలేదని, ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించటంతో రాహుల్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించకపోవటంతో.. రాహుల్ పోలీసు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావటం వల్లే, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్ విలేకరులకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకూ కదిలేది లేదని, అవసరమైతే ఆరు నెలలపాటైనా ధర్నాలోనే కూర్చుంటానని ప్రకటించారు. లోచబ్ కంట్లో మూడు పెల్లెట్లు పడ్డాయని ఆయనకు శస్త్రచికిత్స జరిపిన ఆస్పత్రి ఇచ్చిన నివేదికను ప్రదర్శించారు. లోచబ్ శరీరం నుంచి వైద్యులు తొలగించిన కొన్ని
‘స్కూల్ ఠీకో కరో’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ ( సీజేపీ ) ప్రతినిధుల బృందానికి రాజస్థాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలోకి రావొద్దంటూ కొంతమంది వారిని అడ్డుకుని, దాడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీజేపీ కో-కన్వీర్ అశుతోష్ రంకా నేతృత్వంలో కార్యకర్తలు శుక్రవారం రాజస్థాన్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా జైపుర్ జిల్లా రాంపురా కన్వర్పురా గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామ శివారులోనే పలువురు వీరిని అడ్డుకుని, తమ పాఠశాలను తామే బాగు చేసుకుంటామంటూ.. బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశద్రోహులు’, ‘పాకిస్థానీలు’ అని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమపై దాడి జరిగినట్లు అశుతోష్ వెల్లడించారు. తమ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేసి, తమ వాహనాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారని, అడ్డుకునే ప్రయత్నం చేయాలని రంకా దుయ్యబట్టారు.గోశాలలో నడుస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాలను తనిఖీ చేయడానికి గ్రామస్థులు తమను ఆహ్వానించారని రాంకా పేర్కొన్నారు. ‘‘చాలా సంవత్సరాలుగా ఆ పాఠశాల గోశాలలోనే నడుస్తోంది... గత సంవత్సరం కూడా మేము అదే పాఠశాలను సందర్శించాం. ఈరోజు పర్యటన గురించి మేము పోలీసులకు సమాచారం అందించాం... కానీ బీజేపీ గూండాలు అప్పటికే అక్కడ ఉన్నారు. మా వాలంటీర్లపై దాడి జరిగింది. మా కార్లను ధ్వంసం చేశారు, ఫోన్లను పగలగొట్టారు, ఒక మహిళపై దాడి చేశారు, నా చొక్కాను చింపేశారు.. మా బృంద సభ్యులలో ఒకరి చేయి విరిగింది’’ అని దాడి అనంతరం రాంకా అన్నారు.దాడికి సంబంధించిన దృశ్యాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. తమ బృందంపై దాడి వెనుక బీజేపీ పనేనని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో తమ కార్యకర్తలు గాయపడ్డారని

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బృందానికి రాజస్థాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలోకి రావొద్దంటూ కొంతమంది స్థానికులు వారిని వెళ్లగొట్టారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. దీనిపై స్పందించిన సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. రాష్ట్రంలోని (Rajasthan) భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలో కొంతమంది కార్యకర్తలు శుక్రవారం రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జైపుర్ జిల్లాలోని రాంపురా కన్వర్పురా గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. శివారులోనే స్థానికులు వీరిని అడ్డుకున్నారు. తమ స్కూళ్లను తామే బాగు చేసుకుంటామంటూ.. గ్రామస్థులు సీజేపీ టీమ్‌ను బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ క్రమంలోనే స్థానికులు తమపై దాడి చేసినట్లు అశుతోష్ ఆరోపించారు. తమ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారని, తమ వాహనాలపై ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడకు రాలేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తమ బృందంపై దాడి భాజపా పనేనని మండిపడ్డారు. ఈ ఘటనలో తమ వాళ్లు గాయపడ్డారని తెలిపారు. రాజస్థాన్‌లో గూండాల పాలన ఉందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్
Ship Hijacked Off Somalia Coast : సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ ప్రాంత తీరప్రాంతంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'లుటుఫ్' అనే వాణిజ్య కార్గో నౌకను అపహరించి, తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. వారిలో ఆరుగురు భారతీయ నావికులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలార్ మూవ్మెంట్ షిప్పింగ్ సంస్థకు చెందిన ఈ నౌకలో ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలు రవాణా అవుతున్నాయి. సోమాలియాలోని మొగదిషులో ఉన్న టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి ఈ ఆయుధ సామాగ్రిని చేరవేసే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వారంలో పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఈల్ జిల్లా, మర్రాయ ప్రాంతానికి దాదాపు మూడున్నర నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దొంగలు దాడి చేసి నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ నౌకను నుగాల్ తీరప్రాంతంలోని దంగోరోయో జిల్లా గర్మాల్ సమీపానికి తరలించారు.వివిధ దేశాలకు చెందిన సిబ్బంది బందీ..హైజాక్‌కు గురైన ఈ నౌకలో ఆరుగురు భారతీయ సముద్ర నావికులతో పాటుగా ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియా పౌరుడు భద్రత కోసం నియమించబడిన ఇద్దరు సెర్బియా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. గత ఏప్రిల్ 26వ తేదీన 'స్వార్డ్' అనే మరొక వ్యాపార నౌకను హైజాక్ చేసిన ఎనిమిది మంది సభ్యుల పైరేట్స్ బృందమే ఈ దాడులకు పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భయాందోళనకర ఘటనపై భారత ప్రభుత్వం గానీ టర్కీ అధికార వర్గాలు గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.నౌక అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. టర్కీకి చెందిన రెండు నౌకలు ఈ హైజాక్ అయిన నౌకను సమీపించగా.. టర్కీ హెలికాప్టర్లు, డ్రోన్లు గాల్లోకి లేచి ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాయి

కీవ్: ఉక్రెయిన్‌లోని కీవ్‌పై గురువారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 12 ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. ఈ దాడులతో కీవ్‌లోని పలు చోట్ల మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 90,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని అంతటా రాత్రంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. దాడుల కారణంగా గిడ్డంగులు, పాఠశాల, చిన్నారుల వైద్యశాల దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భవనాల నుంచి సహాయక సిబ్బంది ప్రజలను తప్పిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం విడుదల చేసింది. డ్రోన్ విడిభాగాలను ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఒక సైనిక స్థావరం, ఒక లాజిస్టిక్స్ హబ్‌ను లక్ష్యంగా చేసుకుని కీవ్ సహా చుట్టుపక్కల ప్రాంతంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం

జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులను మృత్యువు కూడా విడదీయలేకపోయింది. భార్య మృతి తట్టుకోలేక భర్త గుండెపోటుతో కన్నుమూయడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల, ఆగస్టు 20: జిల్లాలోని ఆత్మకూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనారోగ్యంతో భార్య లక్ష్మీదేవి మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే భర్త సుబ్బరాయుడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బరాయుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు చావులోనూ తమ అనుబంధాన్ని వీడలేదంటూ స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. భార్య మృతితో కుటుంబంలో నెలకొన్న విషాదం నుంచి తేరుకోకముందే భర్త కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శ్రీరామ్ నగర్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని కేటీకే -1వ గనిలో రాత్రి షిఫ్టులో గోపాలం గోపి (కోల్ కట్టర్) అనే కార్మికునికి గుండెపోటు రాగా తోటి కార్మికులు ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గోపి మృతి చెందాడని ఆరోపిస్తూ సింగరేణి కార్మికులు భూపాలపల్లి ఏరియా సింగరేణి హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. సింగరేణి కార్మికులు చేస్తున్న ధర్నాకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుని మరణాన్ని మైన్ డెత్ గా పరిగణించాలన్నారు. కార్మికుని కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు అందేలా చూడాలని, కార్మికునీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడితల సమ్మయ్య, రత్నం అవినాష్ రెడ్డి, మల్లారెడ్డి తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయా సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా.. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక జీవనాధారంపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. టెహ్రాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా మరో కొత్త ఎత్తుగడతో (US-Iran War) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు సాయం చేసే దేశాలు ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. మరి ఈ బెదిరింపుల ప్రభావం భారత్‌పై ఏ మేర ఉంటుంది..? ఇరాన్‌తో మన వాణిజ్యం ఎలా ఉంది..? ఏ దేశంపైనా ఇప్పటివరకు చేపట్టని అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యను తాను ఈ రోజు ఇరాన్ (Iran)పై ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘‘ఒప్పందం విషయంలో ఇరాన్‌కు నేనిచ్చినంత గొప్ప అవకాశం ఎవరూ ఇవ్వలేదు. కానీ, డీల్ చేసుకోవడంలో వారు విఫలమయ్యారు. అందుకే, ఈ రోజు నేను ఆ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నా. ఇరాన్‌ను ఒంటరిని చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే ఆ దేశ నౌకాదళం నాశనమైంది, వాయుసేన ధ్వంసమైంది. సైనిక కర్మాగారాలు శిథిలమయ్యాయి. వారి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇక, ఇప్పుడు వారికి ఆర్థికంగానూ ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా తమ ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు జీవనాధారాన్ని అందిస్తే గనుక.. ఆ దేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలు.. ఇవన్నీ ఇప్పుడే ఆగిపోవాలి. అవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇరాన్ ముప్పును ఎదుర్కోడానికి, దాన్ని ఏకాకిని చేసి, ఓడించడానికి అమెరికా మిత్రదేశాలన్నీ మాతో కలిసి నిలబడాలి. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదు’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు సాగించే దేశాలన్నింటికీ ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. టెహ్రాన్‌కు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా (India-Iran Trade) ఉంది. ఇరాన్‌తో మనది మిగులు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Uttarakhand School Holidays: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా నారాయణ్‌బగడ్ ప్రాంతంలో హింసాత్మక కుక్కల బెడద విపరీతంగా పెరుగుతున్న తరుణంలో స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ్ బాగ్‌లోని 10 పాఠశాలలకు ఏకంగా నాలుగు రోజులను సెలవులుగా మంజూరు చేశారు. అయితే ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు ఆన్లైన్లో తరగతులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ మధ్య నారాయణబగడ్ వరుసగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా స్థానికుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే తమ పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పాఠశాలకు రాకపోకలు సాగించేటప్పుడు పిల్లలను ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడమే థ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఆన్లైన్ తరగతులను ప్రతిపాదించడం జరిగింది. అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఆన్లైన్లో విద్యార్థులతో అనుసంధానమై వారికి బోధిస్తారు. దీనివల్ల సాధారణ తరగతులు మూసివేసినప్పటికీ పిల్లలు తమ విద్యను కొనసాగించడానికి వీలవుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని అనవసరంగా బయటకు వెళ్లనివ్వవద్దని కూడా కోరారు. దూకుడు స్వభావం గల కుక్కల ఉనికి పాఠశాల విద్యార్థులకే కాకుండా స్థానిక నివాసితులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతాలలో ప్రజలు

ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో పులి దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌నగర్‌లోని గర్జియా ప్రాంతంలో పర్యాటకులు చూస్తుండగానే ఓ బెంగాల్ టైగర్ తన ప్రతాపం చూపించింది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో పులి దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌నగర్‌లోని గర్జియా ప్రాంతంలో పర్యాటకులు చూస్తుండగానే ఓ బెంగాల్ టైగర్ తన ప్రతాపం చూపించింది. గుర్రంపై దాడి చేసి, దాన్ని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనను పర్యాటకులు తమ కెమెరాల్లో చిత్రీకరించారు (Jim Corbett Tiger Attack). గర్జియా ప్రాంతంలోని ఓ కూడలి సమీపంలో ఓ పులి ఒక్కసారిగా గుర్రంపై దాడి చేసింది. అనంతరం గుర్రం మెడను నోటితో పట్టుకుని అడవి లోపలికి లాక్కెళ్లింది. సఫారీ వాహనాల్లో ఉన్న పర్యాటకులు ఈ దృశ్యాలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి గుర్రాన్ని ఈడ్చుకెళ్తున్న సమయంలో కొందరు పిల్లలు భయంతో కేకలు వేయడం వీడియోలో వినిపించింది. పర్యాటక వాహనాలు దగ్గర్లోనే ఉన్నప్పటికీ, పులి ఏమాత్రం భయపడకుండా తన ఆహారాన్ని అడవిలోకి తీసుకెళ్లింది (Tiger Attacks Horse). జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దేశంలోనే అత్యధిక పులులను కలిగిన అభయారణ్యాల్లో ఒకటి (Tiger Attack Video). ప్రస్తుతం ఇక్కడ 260కి పైగా బెంగాల్ పులులు ఉన్నట్లు అంచనా. ఈ అభయారణ్యానికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అడవిని సందర్శించే వారితో పాటు ప్రసిద్ధ గర్జియా ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం.. పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్

పూణేలోని చారిత్రాత్మక సింహగడ్ కోటలో పర్యాటకుల పట్ల కొందరు యువకులు దశ్చర్యకు పాల్పడ్డారు. పర్యాటకులు ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాగించిన ఈ దౌర్జన్యంలో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు.ఆగస్టు 16న ఈ సంఘటన చోటుచేసుకుంది. కోట సందర్శనకు వచ్చిన ఒక కుటుంబాన్ని అడ్డుకున్న కొందరు యువకులు, వారి ఎనిమిదేళ్ల కుమార్తె షార్ట్స్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తలెత్తిన వాగ్వాదం చివరకు భౌతిక దాడికి దారితీయడంతో, కుటుంబ సభ్యుల్లో ఒకరు గాయపడ్డారు.తమను తాము 'కోట సంరక్షణ సమితి' సభ్యులుగా చెప్పుకుంటున్న ఈ బృందం, సుమారు రెండు గంటల పాటు కోట పరిసరాల్లో అలజడి సృష్టించింది. షార్ట్ వంటి అనుచితమైన దుస్తులు ధరించారనే నెపంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అని కూడా చూడకుండా పలువురిపై దాడులకు తెగబడ్డారు. ఈ అరాచకంతో కోటలోని పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.బాధితుల ఫిర్యాదు మేరకు హవేలీ పోలీసులు నిందితులుగా గుర్తించిన తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూణే పరిసరాల్లోని కోటల వద్ద ఇలాంటి స్వయంప్రకటిత బృందాలు నైతిక పోలీసింగ్ పేరిట పర్యాటకులను వేధిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత పులి తిరుపతి జిల్లా చిట్వేలు - రాపూర్ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిట్వేలు నుంచి పెంచలకోన వైపు వెళ్తున్న ప్రయాణికులు రాత్రి వేళ మూడో మలుపు వద్ద చిరుత సంచరిస్తుండటాన్ని గమనించారు. ప్రస్తుతం పెంచలకోనలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బైక్‌లపై వెళ్లే భక్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు హెచ్చరించారు. ఈ వార్తకు సంబంధించిన

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి.. పశ్చిమాసియా యుద్ధానికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోన్న అంశం ఇది. ఈ జలమార్గంపై నియంత్రణ తమకే ఉందంటూ ఇరాన్, అమెరికా గత కొన్ని రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఒక అడుగు ముందుకేసి.. ‘హర్మూజ్ (Strait of Hormuz) ఇక మా భూభాగమే’ అని ప్రకటించుకున్నారు. దీన్ని ఇరాన్ ఖండిస్తున్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ కీలక జలసంధి టెహ్రాన్ చేయి దాటిపోతున్నట్లే కన్పిస్తోంది. హర్మూజ్‌పై ఇరాన్ (Iran) 80శాతం పట్టు కోల్పోయినట్లేనని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. (US-Iran War) హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు రెండు మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐరాస అధీకృత రవాణా మార్గం. అయితే, హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని చెబుతోన్న ఇరాన్.. ఒమన్ రూట్లో వెళ్తోన్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినప్పటికీ.. చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80శాతానికి పైగా నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా నౌకాదళాలు కల్పిస్తోన్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని సదరు డేటా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ హోమాయూన్ అభిప్రాయపడ్డారు. నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్‌ను కెప్లెర్ గుర్తించలేదు. కానీ, రెండు వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్‌ను దాటడానికి అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్

రష్యాపై ఉక్రెయిన్ అత్యంత భారీ స్థాయిలో 791 డ్రోన్లతో విరుచుకుపడింది. 2025 జనవరి తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. మాస్కో పరిసర ప్రాంతాలతో పాటు క్రిమియా, నల్ల సముద్రం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. రష్యాలోని కీలక ప్రాంతాల్లోని ఆన్లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్ గోదాము భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి సుదూర ప్రాంతాలపై దాడులు సర్వసాధారణమయ్యాయి. రష్యా లోతట్టు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ కీవ్ బలగాలు నిరంతరం దాడులను పెంచుతున్నాయి. రష్యా ప్రజలపై యుద్ధ ప్రభావం చూపించి, శాంతి చర్చలకు ఒత్తిడి పెంచడమే ఉక్రెయిన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై పుతిన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మాస్కో ప్రాంతంపై ఏకంగా 600కు పైగా డ్రోన్లు విరుచుకుపడటంతో రష్యా రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకారం, అందులో 180 డ్రోన్లను మాత్రమే రష్యా సైన్యం కూల్చివేయగలిగింది. దీంతో మాస్కో మరియు రియాజాన్ ప్రాంతాల్లో ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు ప్రైవేటు ఇళ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలో ఉన్న పెచెనిహీ గ్రామంపై రష్యా క్షిపణి దాడి చేసింది. రష్యా ప్రయోగించిన రెండు బాండెరోల్ క్రూయిజ్ మిస్సైల్స్ ఒకేసారి గ్రామంపై పడటంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 17 మంది తీవ్రంగా గాయపడగా, 10 ఇళ్లతో పాటు ఒక కేఫ్, పోస్టాఫీసు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ దీన్ని “క్రూరమైన దాడి”గా అభివర్ణించారు. రష్యాకు తాము తప్పకుండా తగిన సమాధానం ఇస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా ఇరు దేశాల

పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై దాడి జరిగింది. పొట్టి దుస్తులు, స్లీవ్‌లెస్ బట్టలు ధరించారనే కారణంతో ఓ మహిళ సహా నలుగురు టూరిస్టులపై కొందరు చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘సమస్త్ హిందూ బంధవ్ ఆర్మీ’ అనే సంస్థకు చెందిన సభ్యులు కోటలోని తానాజీ మలుసరే స్మారకం వద్ద పర్యాటకులను అడ్డగించారు. ‘షార్ట్స్ ఎందుకు వేసుకున్నారు?’ అంటూ ప్రశ్నించి, హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతూ దాడికి పాల్పడ్డారు.ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ఆయనపై చేయి చేసుకోగా, ఓ మహిళ ఆయన భార్యను పక్కకు లాగిపడేసింది. ఇదే తరహాలో మరో మూడు బృందాలు కూడా వేధింపులకు గురైనట్లు ఫిర్యాదులు అందాయి. ఎనిమిదేళ్ల బాలిక బెర్ముడా ధరించడంపై కూడా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.ఈ ఘటనపై హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సంకేత్ సంజయ్ పాటిల్, ఆశిష్ దిలీప్ అపర్తో పాటు మొత్తం 8 మందిపై దాడి, అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు

సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. గ్వాలియర్‌కు చెందిన ఓ కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను క్లిక్ చేసి, నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.98,000 కోల్పోయింది. కేవలం ఒక్క క్లిక్‌తో సైబర్ నేరగాళ్లు వారి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు.పురానీ ఛావనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రపుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జయ ప్రతాప్ సింగ్ బాథమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 11న తన భార్య రచన ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా ఒక ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్ చేయగానే ఆమె ఉపయోగించే మోటోరోలా ఫోన్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది.ఆ సమయంలో వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే రోజు అర్ధరాత్రి బ్యాంకు నుంచి ఓ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయగా, మైనస్ రూ.2,970 చూపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ పరిశీలించగా, మూడు వేర్వేరు యూపీఐ లావాదేవీల ద్వారా రూ.70,000, రూ.20,000, రూ.8,000 చొప్పున మొత్తం రూ.98,000 బదిలీ అయినట్లు తేలింది.దీంతో బాధితులు ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును సైబర్ సెల్‌కు అప్పగించారు. సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి హానికరమైన ప్రకటనలు ఫోన్లలో మాల్వేర్ను ఇన్స్టాల్ చేస్తాయని, తద్వారా సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే యూపీఐ లావాదేవీలు జరుపుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని యాడ్స్‌పై క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం పోలండ్ దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన బత్సల రాంబాబు (37) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రాంబాబుకు భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు బిందుశ్రీ (4), చరిష్మ (8 నెలలు) ఉన్నారు.రాంబాబు జీవనోపాధి కోసం 2025 డిసెంబర్లో పోలండ్‌కు వెళ్లాడు. అతడు విదేశాలకు వెళ్లే సమయానికి భార్య లావణ్య గర్భవతి. రాంబాబు వెళ్లిన కొద్ది నెలలకే ఆమె రెండో కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 8 నెలలు. కన్నబిడ్డను ఒక్కసారి కూడా కళ్లారా చూసుకోకుండానే రాంబాబు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సహాయం చేయాలని స్థానిక టీడీపీ నేత శివప్రసాద్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘హర్మూజ్.. అమెరికా కొత్త ప్రదేశం’ అని ఆ జలసంధి మ్యాప్‌పై రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ను దిగ్బంధనం చేసిన అమెరికా.. ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు మరోవైపు.. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు హర్మూజ్‌పై పట్టును కొనసాగిస్తామని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ మంగళవారం స్పష్టం చేశారు. ‘‘ఒప్పందం ప్రకారం దిగ్బంధనాన్ని ఎత్తేయాలి. స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి. చమురుపై ఆంక్షలను తొలగించాలి. అదేవిధంగా సైనిక చర్యలకు ముగింపు పలకాలి. అప్పటివరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోం’’ అని స్పష్టంచేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వలలో చిక్కిన ఆక్టోపస్‌ను పడవలోకి తీసుకున్న క్షణాల్లోనే అది అతడిపై దాడి చేసింది. నేరుగా ముఖానికి అతుక్కుపోయి టెంటకిల్స్‌తో తలను చుట్టేసింది. నోటిని సక్కర్లతో మూసేసింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో అతడు ప్రాణభయంతో దాన్ని వదిలించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.ఫిలిప్పీన్స్ సమీప సముద్రంలో గత నెల ఈ ఘటన జరిగినట్లు సమాచారం. జెస్సర్ సెర్వాంటెస్ అనే మత్స్యకారుడు చెక్క పడవలో చేపలు పడుతుండగా ఆక్టోపస్ వలకు చిక్కింది. దాన్ని పైకి తీసుకున్న వెంటనే అది ఒక్కసారిగా అతడి ముఖంపైకి దూసుకొచ్చింది. దాని టెంటకిల్స్ తల చుట్టూ బిగుసుకున్నాయి. బలమైన సక్కర్లు ముఖానికి అతుక్కుపోవడంతో సెర్వాంటెస్ దాన్ని చేతులతో తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఆక్టోపస్ అతడి నోటినీ కప్పేయడంతో ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో పక్కనే ఉన్న వెదురు కర్ర ముక్కను తీసుకున్న సెర్వాంటెస్ దానితో ఆక్టోపస్‌ను పదేపదే కొట్టాడు. కొంతసేపటి తర్వాత దాని పట్టు సడలింది. వెంటనే దాన్ని ముఖం నుంచి లాగి సముద్రంలోకి వదిలేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై సెర్వాంటెస్ స్పందిస్తూ.. తాను పట్టుకున్న ఆక్టోపస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైందని చెప్పాడు. అది తన ముఖాన్ని దాదాపుగా చీల్చేసినంత పని చేసిందని తెలిపాడు. ఆక్టోపస్‌ల టెంటకిల్స్పై ఉండే సక్కర్లు ఉపరితలాలకు బలంగా అతుక్కోగలవు. స్పర్శతో పరిసరాలను గుర్తించడంలోనూ అవి ఎంతో సమర్థంగా ఉంటాయి. ఫిలిప్పీన్స్ సముద్ర

ఇంటర్నెట్ డెస్క్: ఇరాక్‌లోని కుర్దిస్థాన్(Kurdistan) ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ (PM Barzani) కార్యాలయంపై సోమవారం రాత్రి డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడులకు ఇరానే కారణమని కుర్దిస్థాన్ భద్రతా సంస్థ ఆరోపించింది. ప్రధాని కార్యాలయంతో పాటు కుర్దిస్థాన్ భద్రత, నిఘా సంస్థ ‘పరాస్తిన్’ అధిపతి నివాసాన్ని కూడా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. కీలక ప్రభుత్వ, భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని తెలిపింది. కుర్దిస్థాన్ ప్రధాని మస్రూర్ బర్జానీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కుర్దిస్థాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ చేసిన తీవ్రమైన చర్య అని ఆరోపించారు. కుర్దిస్థాన్ ఆరోపణలను ఇరాన్(iran) ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌పై నిందలు మోపేందుకు ఇతర శక్తులు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) అనుమానం వ్యక్తం చేశారు. ఇరాక్(Iraq)లోని కుర్దిస్థాన్ ప్రాంతం ఇరాన్‌కు సమీపంలో ఉండటంతో గత కొంతకాలంగా ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు, బలగాలకు కుర్దిస్థాన్‌లో స్థావరాలు ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజా ఘటనతో కుర్దిస్థాన్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ

Houthis Red Sea Attack : ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ గ్రూప్.. సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనిక ల్యాండింగ్ నౌకతో పాటు దానికి రక్షణగా ఉన్న నాలుగు ఎస్కార్ట్ బోట్లను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటన యెమెన్‌లోని నైరుతి తీర ప్రాంతం మోఖా పోర్ట్ సమీపంలోని ఎర్ర సముద్రంలో జరిగినట్లు సమాచారం. హౌతీలు సోమవారం ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించారు. సౌదీ సైనిక ల్యాండింగ్ షిప్‌తో పాటు నాలుగు ఎస్కార్ట్ బోట్లపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు తెలిపారు. అయితే దాడిలో ఎంత మేర నష్టం జరిగింది, ప్రాణనష్టం ఏమైనా సంభవించిందా అనే విషయంపై పూర్తి వివరాలు వెంటనే వెల్లడికాలేదు. ఎర్ర సముద్రంలో వాణిజ్య, సైనిక నౌకలపై దాడుల ముప్పు ఇటీవల పెరుగుతోంది. హౌతీలు సౌదీకి సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని గతంలో ప్రకటించారు. జూలైలో సౌదీపై సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించిన తర్వాత సౌదీకి అనుబంధంగా ఉన్న ట్యాంకర్లపై దాడులు చేసినట్లు కూడా హౌతీలు ప్రకటించారు. ఇటీవల బాబ్ అల్-మందెబ్ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు రాయిటర్స్, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఈ పరిణామాలు ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం.. ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందెబ్ మార్గాలు ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు. ఈ ప్రాంతంలో దాడుల ముప్పు పెరగడంతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. సౌదీ చమురు ఎగుమతుల విషయంలోనూ భద్రతా ఆందోళనలు పెరిగినట్లు రాయిటర్స్ పేర్కొంది. సౌదీ ప్రయోజనాలకు సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ప్రకటించిన నేపథ్యంలో తాజా దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఎర్ర సముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల భద్రతపై ఇప్పుడు అంతర్జాతీయంగా

Basit Ali : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ గుండెపోటుకు గురి అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కరాచీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యాంజియోప్లాస్టీ అనేది గుండెలోని ఇరుకైన లేదా మూసుకుపోయిన ధమనులను వెడల్పు చేయడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. ఇందులో క్యాథెటర్, బెలూన్ను ఉపయోగించి ధమనిలో పేరుకుపోయిన కొవ్వును తొలగించి రక్తప్రసరణను మెరుగుపరుస్తారు. అవసరమైతే రక్తనాళం తెరిచి ఉంచేందుకు స్టెంట్‌ను అమర్చుతారు. Shubman Gill stunning catch : శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్.. సింగిల్ హ్యాండ్‌తో.. వీడియో వైరల్.. Our beloved Basit ali is going through angioplasty we wish him successful procedure and speedy recovery…please keep him in your thoughts and prayers 🙏 — Najeeb ul Hasnain (@ImNajeebH) August 17, 2026 బాసిత్ అలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆకాంక్షిస్తున్నారు. 55 ఏళ్ల బాసిత్ అలీ 22 ఏళ్ల వయసులో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. తన బ్యాటింగ్ శైలితో ఆయనను అప్పట్లో పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ జావెద్ మియాందాద్‌తో పోల్చేవారు. ముఖ్యంగా వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లపై బాసిత్ అలీ ధైర్యంగా షాట్లు ఆడేవారు. అయితే.. ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతడి ప్రతిష్ట దెబ్బతింది. పాకిస్థాన్ తరఫున బాసిత్ అలీ 19 టెస్టులు ఆడి 33 ఇన్నింగ్స్‌లలో 858 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. 50 వన్డేల్లో 1,265 పరుగులు సాధించారు. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధసెంచరీలు ఉన్నాయి
Lakshmi Mittal Ukraine Factory Attack : రష్యా-ఉక్రెయిన్ నడుమ సాగుతున్న యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా.. వారు మాత్రం పోరాటం ఆపడం లేదు. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకుండా.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి. ఈ ఘర్షణల క్రమంలోనే భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ లక్ష్మీ మిత్తల్‌కు చెందిన భారీ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని క్రివి రిహ్ నగరంలో ఉన్న ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగ్గా... ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఉక్రెయిన్‌లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థపై దాడిఉక్రెయిన్లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్ కాంప్లెక్స్‌పై జరిగిన ఈ దాడి వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యా క్షిపణి ధాటికి ఫ్యాక్టరీలోని కీలకమైన కోర్ ఎనర్జీ రంగాలు, బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్లాంట్ పరిధిలో ఉక్కు ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయినట్లు సదరు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కూడా రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల ప్రభావంతో నగరంలోని అత్యంత పెద్ద బుక్ మార్కెట్లో భారీగా మంటలు చెలరేగాయి. పౌర సదుపాయాలే లక్ష్యంగా పుతిన్ సేనలు దాడులకు తెగబడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు.ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో.. రష్యా ప్రతీకార చర్యలుగత కొన్ని రోజులుగా రష్యాలోని సైనిక కర్మాగారాలు, ఇంధన మౌలిక సదుపాయాలను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంటోంది. దీనివల్ల రష్యా ప్రభుత్వం తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఆదివారం రష్యా వ్యాప్తంగా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో దాడికి దిగింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇది కూడా ఒకటి కాగా.. ఈ ఘటనల్లో

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివి రిహ్‌లోని ఆర్సెలార్ మిట్టల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఈ ప్లాంట్ ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ సరఫరా, బ్లాస్ట్ ఫర్నేస్‌లకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేసినట్లు యాజమాన్యం ధ్రువీకరించింది.Russia- Ukraine war: రష్యా ఖేల్ ఖతం.. 1000 కుపైగా డ్రోన్ లతో విధ్వంసంరష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేపట్టిన వందలాది డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే రష్యాఈ చర్యకు పూనుకుంది. రష్యాపై కీవ్ జరిపిన దాడులలో దాదాపు 822 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని రష్యా ప్రకటించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల రష్యా ప్రాంతాల్లో ఆరుగురు మరణించినట్లు మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ వెల్లడించారు.మాస్కో, రోస్టోవ్ ప్రాంతాల్లో నష్టం మాస్కో వైపు వచ్చిన దాదాపు 600 డ్రోన్లలో ఒక మూడొంతుల వరకు నగర సరిహద్దుల్లోనే ధ్వంసమయ్యాయి. కానీ ఓ ప్రైవేట్ ఇంటిపై పడిన డ్రోన్ దాడిలో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రష్యాలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం వైల్డ్‌బెర్రీస్ గోదాంపై కూడా దాడి జరగడంతో భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇక రష్యా నైరుతి ప్రాంతమైన రోస్టోవ్పై 150కి పైగా డ్రోన్లతో జరిపిన దాడుల్లో ఐదుగురు మరణించగా.. అనేక ఇళ్లు, రైల్వే స్టేషన్ దెబ్బతిన్నాయి.ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ సీఈఓపై హత్యాయత్నం!యుద్ధంలో మారుతున్నవ్యూహాలు గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం నేరుగా భూతలంపై పోరాటాలు తగ్గిపోయాయి. శాంతిచర్చలు కూడా నిలిచిపోవడంతో ఇరుదేశాలు సుదూర ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా సైనిక

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రంగా మారాయి. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని క్రివీ రిహ్‌లో ఉన్న ఈ కర్మాగారం దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఉక్కు పరిశ్రమగా ఉంది. దాడిలో ఇద్దరు మృతి చెందారు. 14 మంది కార్మికులు గాయపడ్డారు. కీలక విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్‌లకు నష్టం వాటిల్లడంతో ఉత్పత్తిని కొంతకాలం నిలిపివేయాల్సి వచ్చింది.ఈ దాడికి ముందు రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా అంతటా 822 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. మాస్కో వైపు దాదాపు 600 డ్రోన్లు దూసుకొచ్చాయని నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ చెప్పారు. వాటిలో మూడో వంతును మాస్కో ప్రాంతంలోనే కూల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.మాస్కో సమీపంలోని ఓ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడంతో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మరో దాడిలో రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగిలో భారీగా మంటలు చెలరేగాయి. రోస్టోవ్ ప్రాంతంలో 150కి పైగా డ్రోన్లతో జరిగిన దాడిలో ఐదుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇళ్లు, రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి.మరోవైపు రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రాణనష్టం జరిగింది. క్రివీ రిహ్‌లో మరో వ్యక్తి చనిపోయాడు. జపొరిజియా, సుమీ, డొనెట్స్క్ ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. కీవ్‌లో రష్యా దాడులతో మంటలు చెలరేగాయి. ఓ