
Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్‌ప్లేయర్ అవుట్
Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్
© 2026 nimisham.in

Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్

Asian Games 2026: గోల్డ్ కోసం మొనగాళ్లనే పంపుతాం..: బీసీసీఐ

Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్ సిబ్బంది ఉన్నారు.ఆసియా గేమ్స్ సమయంలో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గంభీర్‌కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో లక్ష్మణ్ భారత పురుషుల జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.లక్ష్మణ్‌కు సునీల్ జోషి, హృషీకేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ సహాయకులుగా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఇంగ్లాండ్‌తో వైట్‌బాల్ సిరీస్ తర్వాత గంభీర్‌కు విశ్రాంతి ఇచ్చిన సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు.మరోవైపు ఆసియా గేమ్స్‌లో క్రికెట్ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజీ కీలక

India vs Pakistan Womens Match: ఆసియా క్రికెట్ వేదికపై మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగనున్న ఈ సమరంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడే తేదీ కూడా ఖరారైంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ మ్యాచ్ షెడ్యూల్ వివరాలు ఇవే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా సమరం.. మహిళల టీ20 ఆసియా కప్ పదో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మెగా టోర్నీ అత్యంత ఘనంగా సాగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 ఆసియా దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిని చెరో నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..! గ్రూప్-ఎ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పాకిస్థాన్, థాయిలాండ్, హాంకాంగ్ జట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో ఉండటంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఖాయమైంది. ఈ ప్రతిష్టాత్మక సమరానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తాజాగా 15 మంది సభ్యులతో కూడిన తమ బలమైన మహిళా జట్టును అధికారికంగా ప్రకటించింది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహా సమరం ఎప్పుడంటే? క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భారత జట్టు తమ ప్రయాణాన్ని ఆగస్టు 30వ తేదీన థాయిలాండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్ జట్టుతో తలపడుతుంది. గ్రూప్ దశలో చివరిదైన అత్యంత కీలక పోరులో సెప్టెంబర్ 5న భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ

భారత్‌లో పెద్దగా పరిచయం లేని సెపక్ టక్రా గేమ్స్‌లో మన జట్టు మరోసారి సత్తా చాటింది. ఆసియాగ్నేసియా ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన సెపక్ టక్రా గేమ్‌లో భారత్ తాజాగా కాంస్య పతకం సాధించింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన కింగ్స్ కప్ సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో పురుషుల క్వాడ్రాంట్ (నలుగురు ఆటగాళ్లు కలిసి) ఈవెంట్లో భారత్ ఈ పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో భారత్ 15-9, 9-15, 9-15తో ఆతిథ్య థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన పోరులో భారత ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం విశేషం. ఈ విజయంతో భారత్ ఆసియా గేమ్స్‌లో పతకం ఆశలు రేపుతోంది. ఎందుకంటే సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో సెపక్ టక్రా గేమ్ ఉండడమే దీనికి కారణం. ప్రతిష్టాత్మ ఆసియా క్రీడల్లో సెపక్ టక్రాలో భారత్ పతకం సాధించాలని ఆశిద్దాం. ఏమిటీ సెపక్ టక్రా? సెపక్ టక్రా లేదా సెపక్ట క్రా అనేది ఆగ్నేయాసియాకు చెందిన ప్రసిద్ధ క్రీడ. దీనిని బ్యాడ్మింటన్ కోర్టును పోలిన కోర్టులో ఇరు జట్ల నుంచి రెండు నుంచి నలుగురు ఆటగాళ్లు ఆడడం జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో బెత్తన్ లేదా ప్లాస్టిక్‌తో చేసిన బంతిని ఉపయోగిస్తారు. ఈ ఆటలో బంతిని తాకడానికి ప్లేయర్లు తమ పాదాలు, మోకాలు, భుజాలు, ఛాతీ, తలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే సెపక్ టక్రా గేమ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌ను పోలి ఉంటుంది. సెపక్ టక్రాను మలేషియా జాతీయ క్రీడగా పరిగణిస్తారు. అయితే ఇదే క్రీడను పలు దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మలేషియాలో సెపక్ టక్రా, ఇండోనేషియాలో సెపక్ రాగా, థాయ్‌లాండ్‌లో టక్రా, మయన్మార్‌లో చిన్లోన్, ఫిలిప్పీన్స్‌లో సిపా, లావోస్‌లో లతావ్, కంబోడియాలో సెక్ డై, వియత్నాంలో కౌ మే వంటి పేర్లతో పిలుస్తుంటారు. పేర్లు ఏదైనా ఆట మాత్రం అన్నింటిలో అదే విధంగా ఉంటుంది. ఇక 1965లో కౌలలంపూర్‌లో జరిగిన