
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు
Ship Hijacked Off Somalia Coast : సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ ప్రాంత తీరప్రాంతంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'లుటుఫ్' అనే వాణిజ్య కార్గో నౌకను అపహరించి, తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. వారిలో ఆరుగురు భారతీయ నావికులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలార్ మూవ్మెంట్ షిప్పింగ్ సంస్థకు చెందిన ఈ నౌకలో ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలు రవాణా అవుతున్నాయి. సోమాలియాలోని మొగదిషులో ఉన్న టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి ఈ ఆయుధ సామాగ్రిని చేరవేసే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వారంలో పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఈల్ జిల్లా, మర్రాయ ప్రాంతానికి దాదాపు మూడున్నర నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దొంగలు దాడి చేసి నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ నౌకను నుగాల్ తీరప్రాంతంలోని దంగోరోయో జిల్లా గర్మాల్ సమీపానికి తరలించారు.వివిధ దేశాలకు చెందిన సిబ్బంది బందీ..హైజాక్‌కు గురైన ఈ నౌకలో ఆరుగురు భారతీయ సముద్ర నావికులతో పాటుగా ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియా పౌరుడు భద్రత కోసం నియమించబడిన ఇద్దరు సెర్బియా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. గత ఏప్రిల్ 26వ తేదీన 'స్వార్డ్' అనే మరొక వ్యాపార నౌకను హైజాక్ చేసిన ఎనిమిది మంది సభ్యుల పైరేట్స్ బృందమే ఈ దాడులకు పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ భయాందోళనకర ఘటనపై భారత ప్రభుత్వం గానీ టర్కీ అధికార వర్గాలు గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.నౌక అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. టర్కీకి చెందిన రెండు నౌకలు ఈ హైజాక్ అయిన నౌకను సమీపించగా.. టర్కీ హెలికాప్టర్లు, డ్రోన్లు గాల్లోకి లేచి ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాయి

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Kamindu Mendis Two Hands Bowling: శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌లో ఉన్న అరుదైన టాలెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. రెండు చేతులతోనూ స్పిన్ బౌలింగ్ చేస్తూ.. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. కుడిచేత్తో 'ఆఫ్ స్పిన్' అలాగే ఎడమచేత్తో 'లెఫ్ట్ ఆర్మ్ స్పిన్' వేయగలడు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన రికార్డులు కల్గిన ఈ ఆల్‌రౌండర్.. భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో శ్రీలంక టీమ్‌కు కీలక ఆటగాడిగా మారనున్నాడు. గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక వైస్ కెప్టెన్‌గా కమిందు మెండిస్ ఉన్నాడు. ధనంజయ డి సిల్వా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఒకే ఓవర్లలో రెండు వేర్వేరు చేతులతో బౌలింగ్ చేయడం పూర్తి లీగల్. అయితే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏ చేతితో బౌలింగ్ చేయబోతున్నాడు..? వికెట్‌కు ఏ వైపు నుంచి వేస్తున్నాడు..? అనే విషయాన్ని ముందుగా అంపైర్‌కు చెప్పాలి. ఈ విషయాన్ని స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు అంపైర్ తెలియజేస్తారు. ఒకవేళ బౌలర్ అంపైర్‌కు చెప్పకుండా హఠాత్తుగా హ్యాండ్ ఛేంజ్ చేసి బౌలింగ్ చేస్తే.. అంపైర్ దానిని 'నో బాల్'గా ప్రకటిస్తారు. ఒక ఓవర్లో బౌలర్ ఎన్నిసార్లయినా చెయ్యి మార్చి బౌలింగ్ చేయవచ్చు. హ్యాండ్ మార్చిన ప్రతిసారీ అంపైర్‌కు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. గతంలో జరిగిన అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లలో రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేశాడు కమిందు మెండిస్. పిచ్ పరిస్థితులను బట్టి బౌలింగ్ కోణాన్ని మార్చుకోవచ్చు. పిచ్‌పై ఉండే రఫ్ ప్యాచెస్‌ను ఉపయోగించుకుని వికెట్లు తీయవచ్చు. హఠాత్తుగా బౌలింగ్ స్టైల్
చంకలో నలుపు తొలగించడానికి బేకింగ్ సోడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికోసం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి ఈ పేస్ట్‌ను చంకల్లో రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే వారంలో రెండుసార్ల కంటే ఎక్కువగా బేకింగ్ సోడా అప్లై చేస్తే దురద వస్తుంది. బంగాళాదుంప రసంలోని ఎంజైమ్స్ చంకల్లో నలుపు తొలగించి, దుర్వాసన రాకుండా కాపాడుతాయి. దీనికోసం స్నానం చేసే ముందు బంగాళాదుంప ముక్కలతో చంకల్లో మర్దన చేయొచ్చు. లేదంటే రసాన్నిఅప్లై చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. కొబ్బరి నూనెలోని సమ్మేళనాలు చంకల్లో నల్లదనం తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం రాత్రి పడుకునే ముందు చంకల్లో కొబ్బరి నూనె రాసి ఉదయం క్లీన్ చేసుకుంటే చాలు. చంకల్లో నలుపు, దుర్వాసన రాకుండా చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది.దీనికోసం నిమ్మకాయను కట్ చేసి ఆ ముక్కతో చంకల్లో మర్దన చేయండి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. అలోవెరాలోని మాయిశ్చరైజింగ్ గుణాలు చంకల్లో నలుపు తొలగించడంలో సహాయపడతాయి దీనికోసం తాజా అలోవెరాను చంకల్లో అప్లై చేసి అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కీరదోసలోని సమ్మేళనాలు చంకల్లో నలుపు పోగొట్టడంలో దోహదపడతాయి. దీనికోసం కీరదోస ముక్కలతో చంకల్లో మర్దన చేయండి. 15 నిమిషాలు ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చంకల్లో నల్లదనం తొలగించడానికి పసుపు, పెరుగు ప్యాక్ ఉపయోగించొచ్చు. దీనికోసం పసుపులో పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని చంకల్లో రాసుకోండి. అరగంట ఉంచి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చర్మంపై మృత కణాలు తొలగించి చంకల్లో మురికి పోగొట్టడానికి ఈ చిట్కా ఉపయోగించొచ్చు.దీనికోసం వెనిగర్‌లో నీళ్లు సమపాళ్లలో కలిపి చంకల్లో రాసుకోండి. కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. శనగ పిండి నేచురల్ స్క్రైబ్ మాదిరి పనిచేసి చంకిలిలో నలుపు తొలగిస్తుంది. దీనికోసం శనగ పిండిలో కొద్దిగా పసుపు, పాలు కలిపి ఈ పేస్ట్‌ను చంకల్లో రాసుకోండి. 10

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు (Aqua Farmers) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నదాతలకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించనుంది. ఈ మేరకు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీపై ఈరోజు (మంగళవారం) ఎనర్జీ శాఖ జీవో ఆర్టీ నంబర్- 57 జారీ చేసింది. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు రూ.1.50 యూనిట్ రాయితీని ఏపీ సర్కార్ కల్పించనుంది. APSADA, CAA చట్టాల కింద రిజిస్టరైన అన్ని అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా రూ.1.50 యూనిట్ విద్యుత్ అందించనుంది. సుమారు 6,500 రిజిస్టర్డ్ ఆక్వా ఫారాలకు ఈ రాయితీ వర్తించనుంది. భవిష్యత్తులో APSADA/CAA రిజిస్ట్రేషన్ పొందే అర్హత కలిగిన ఆక్వా ఫారాలకు కూడా రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రాయితీ కల్పించనుంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి రూ.1.50 యూనిట్ రాయితీ అమలు చేయనుంది. ఆక్వా ఉత్పత్తి వ్యయంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఊరట కలిగింది. ప్రపంచ ఆక్వా ఎగుమతుల మార్కెట్లో పోటీ ధర, నాణ్యతతో నిలదొక్కుకునేందుకు విద్యుత్ రాయితీ అందించనుంది. ఆక్వా రైతుల వివరాలను మత్స్యశాఖ DISCOMలకు అందించనుంది. మత్స్యశాఖ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం రాయితీ విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్ గుడ్‌న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

ఇరాన్ తో గత 6 నుంచి 7 నెలలుగా జరుగుతున్న యుద్ధం అమెరికా రక్షణ రంగాన్ని కలవరపెడుతోంది. కీలకమైన మిస్సైల్ ఇంటర్సెప్టర్లు, ఇతర మందుగుండు సామాగ్రి నిల్వలు దాదాపుగా అడుగంటిపోయాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పాట్రియట్, థాడ్ వంటి క్షిపణి వ్యవస్థలకు తీవ్ర కొరత ఏర్పడటంతో పెంటగాన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇది అమెరికా రక్షణ సన్నద్ధతపై తీవ్ర ప్రభావం చూపుతుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభానికి దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న నిర్ణయాలు ఒక కారణమైతే, ఇటీవల ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధ సాయం మరో కారణమని తెలుస్తోంది. అయితే, ప్రధానంగా గత కొన్ని నెలలుగా ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఈ కొరత మరింత తీవ్రమైంది. అగ్రరాజ్యం తన వద్ద ఉన్న కీలకమైన క్షిపణులను పెద్ద సంఖ్యలో వాడటంతో నిల్వలు కనీస స్థాయికి పడిపోయాయని సమాచారం. భవిష్యత్తులో ఏదైనా పెద్ద ముప్పు ఎదురైతే ఎలాగన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీంతో పెంటగాన్ యుద్ధ ప్రాతిపదికన 67 బిలియన్ డాలర్ల అదనపు నిధులను కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా, ఆయుధాల తయారీకి పట్టే సమయం అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. ఒక పాట్రియట్ క్షిపణిని తయారు చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పడుతుందని మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ వెల్లడించారు. తక్షణమే ఉత్పత్తిని పెంచినా, ప్రస్తుత అవసరాలను తీర్చడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఫలితంగా వాషింగ్టన్లో రాజకీయ చర్చలు వేడెక్కాయి. సెనేటర్ క్రిస్ మర్ఫీ, ఇరాన్ యుద్ధం ముగిసే వరకు కొత్త నిధుల విడుదలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన టోమహాక్ క్షిపణులు కూడా దాదాపుగా అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయుధ కొరత వల్ల అమెరికా రక్షణ సామర్థ్యంపై చైనా తప్పుడు సంకేతాలు పొందే ప్రమాదం ఉందని ఎస్పెర్ తీవ్రంగా హెచ్చరించారు