చంకలో నలుపు తొలగించడానికి బేకింగ్ సోడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికోసం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి ఈ పేస్ట్‌ను చంకల్లో రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే వారంలో రెండుసార్ల కంటే ఎక్కువగా బేకింగ్ సోడా అప్లై చేస్తే దురద వస్తుంది.
బంగాళాదుంప రసంలోని ఎంజైమ్స్ చంకల్లో నలుపు తొలగించి, దుర్వాసన రాకుండా కాపాడుతాయి. దీనికోసం స్నానం చేసే ముందు బంగాళాదుంప ముక్కలతో చంకల్లో మర్దన చేయొచ్చు. లేదంటే రసాన్నిఅప్లై చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు.
కొబ్బరి నూనెలోని సమ్మేళనాలు చంకల్లో నల్లదనం తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం రాత్రి పడుకునే ముందు చంకల్లో కొబ్బరి నూనె రాసి ఉదయం క్లీన్ చేసుకుంటే చాలు.
చంకల్లో నలుపు, దుర్వాసన రాకుండా చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది.దీనికోసం నిమ్మకాయను కట్ చేసి ఆ ముక్కతో చంకల్లో మర్దన చేయండి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
అలోవెరాలోని మాయిశ్చరైజింగ్ గుణాలు చంకల్లో నలుపు తొలగించడంలో సహాయపడతాయి దీనికోసం తాజా అలోవెరాను చంకల్లో అప్లై చేసి అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
కీరదోసలోని సమ్మేళనాలు చంకల్లో నలుపు పోగొట్టడంలో దోహదపడతాయి. దీనికోసం కీరదోస ముక్కలతో చంకల్లో మర్దన చేయండి. 15 నిమిషాలు ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
చంకల్లో నల్లదనం తొలగించడానికి పసుపు, పెరుగు ప్యాక్ ఉపయోగించొచ్చు. దీనికోసం పసుపులో పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని చంకల్లో రాసుకోండి. అరగంట ఉంచి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
చర్మంపై మృత కణాలు తొలగించి చంకల్లో మురికి పోగొట్టడానికి ఈ చిట్కా ఉపయోగించొచ్చు.దీనికోసం వెనిగర్‌లో నీళ్లు సమపాళ్లలో కలిపి చంకల్లో రాసుకోండి. కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
శనగ పిండి నేచురల్ స్క్రైబ్ మాదిరి పనిచేసి చంకిలిలో నలుపు తొలగిస్తుంది. దీనికోసం శనగ పిండిలో కొద్దిగా పసుపు, పాలు కలిపి ఈ పేస్ట్‌ను చంకల్లో రాసుకోండి. 10 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోండి.




