
Andhra Jyothy•Politics•19 ఆగ
జూడాలకు ఉపకార వేతనం పెంపు
తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. జూడాలకు 5 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన చేసింది. పెంచిన ఈ శాతాన్ని 2026 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఇక నుంచి పీజీతో పాటు సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ప్రతి ఏటా స్టైఫండ్ 3 శాతం పెంచనున్నట్లు స్పష్టం చేసింది. జూనియర్ డాక్టర్లు తక్షణమే విధుల్లోకి చేరాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది