
వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు
Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కీలక ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండోదశ విస్తరణలో విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. రన్‌వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.హకీంపేటలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో ప్రతిపాదన జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకెళ్లేలా ప్రణాళిక ఉంది. దీనివల్ల విమానాశ్రయ రన్‌వేకు సంబంధించిన పరిమితులను అధిగమించి భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఏర్పడుతుంది.శంషాబాద్ పరిధిలోనూ సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో ప్రతిపాదన అలాగే నాగోల్-శంషాబాద్ కారిడార్‌లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రోను ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణలో కార్గో స్టేషన్, ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.శామీర్‌పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్బేగంపేట విమానాశ్రయం రన్‌వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శామీర్‌పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. రైల్వే క్రాసింగ్‌లు కూడా కీలక సవాలుగా మారనున్నాయి. ఫలక్‌నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్‌లను దాటాల్సి ఉంటుంది.ఆ జాతీయ రహదారుల వెంట మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులుదీనికోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం అనుమతి ఇంకా పెండింగ్‌లో ఉంది. జాతీయ రహదారుల

Victoria 1107 Runs Record: ఆధునిక క్రికెట్లో టీ20ల రాకతో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. పదుల సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వన్డేల్లో 400 పరుగులు, టెస్టుల్లో 700 పరుగులు చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. సరిగ్గా 99 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక బ్యాట్లు, రక్షణ పరికరాలు లేని కాలంలోనే ఓ జట్టు బౌలర్లపై అత్యంత దారుణంగా దాడికి దిగింది. 1926 డిసెంబర్ 24న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ దీనికి వేదికైంది. ఆ రోజు విక్టోరియా బ్యాటర్లు ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక మహా రికార్డుగా మిగిలిపోయింది. విల్ వుడ్‌ఫుల్ సారథ్యంలోని ఆ జట్టు ఏకంగా 1107 పరుగులు బోర్డుపై ఉంచి కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో వెయ్యికి పైగా పరుగులు చేయడం భవిష్యత్తులోనూ ఏ జట్టుకు సాధ్యపడకపోవచ్చు. ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన పోన్స్‌ఫోర్డ్.. న్యూ సౌత్ వేల్స్ బౌలర్లకు ఆ మ్యాచ్ ఒక పీడకల లాంటిది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విక్టోరియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్ (133) పరుగుల వరదకు పునాది వేశాడు. అతనికి తోడుగా వచ్చిన మరో ఓపెనర్ బిల్ పోన్స్‌ఫోర్డ్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 36 ఫోర్లు బాది 352 పరుగులతో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్క్ హెండ్రీ 100 పరుగులు సాధించగా, నాలుగో నంబర్ బ్యాటర్ జాక్ రైడర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు

Sachin Tendulkar: బెంగళూరులోని ఒక హోటల్ వేదికగా 1995లో జరిగిన ఒకే ఒక్క ఒప్పందం భారత క్రీడారంగ వాణిజ్య స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. 22 ఏళ్ల సచిన్ టెండూల్కర్ సంతకం చేసిన ఆ ఒక్క కాంట్రాక్ట్.. సాధారణ మ్యాచ్ ఫీజులపై ఆధారపడే భారత క్రికెటర్లను వందల కోట్ల బ్రాండ్లుగా మార్చే దిశగా తొలి అడుగు వేసింది. 1995 జులైలో రవిశాస్త్రి టీవీ వ్యాఖ్యాతగా పనుల్లో బిజీగా ఉన్న సమయంలో వర్డ్‌టెల్ అధినేత మార్క్ మస్కరెన్హాస్ను కలిశారు. సచిన్ టెండూల్కర్ కమర్షియల్ హక్కులను నిర్వహించేందుకు ఆసక్తి ఉందా అని రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు మార్క్ వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌లో బెంగళూరులోని తాజ్ రెసిడెన్సీ హోటల్లో సచిన్ సోదరుడు అజిత్ టెండూల్కర్‌తో మార్క్ సమావేశమయ్యారు. ఐదేళ్ల కాలానికి గానూ రూ.2.5 మిలియన్ డాలర్లు (అప్పట్లో మన కరెర్సీలో సుమారు రూ.7.5 కోట్లు) గ్యారెంటీ ఇస్తూ సచిన్ కమర్షియల్ రైట్స్ కోసం మార్క్ ఆఫర్ ఇచ్చారు. న్యాయవాదుల వివాదాలు, కమిటీల చర్చలు లేకుండా సచిన్ కుటుంబం ఒకే రోజులో ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో మారిన భారత క్రికెట్ వ్యాపార సూత్రాలు ఆ రోజుల్లో భారత ఆటగాళ్లకు యాన్యువల్ కాంట్రాక్టులు లేవు. క్రికెటర్లు కేవలం మ్యాచ్ ఫీజులు, చిన్నపాటి పత్రిక ప్రకటనలపైనే ఆధారపడేవారు. బీసీసీఐ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు దూర్దర్శన్కే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే 1995 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎయిర్‌వేవ్స్ ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రజా ఆస్తి అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో ప్రసార హక్కుల వేలం తెరుచుకుంది. 1996 ప్రపంచకప్ ప్రసార హక్కులను వర్డ్‌టెల్ సంస్థ 10 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ప్రసార హక్కులతో పాటు భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సచిన్ బ్రాండ్ హక్కులను కూడా ఒకే సంస్థ చేజిక్కించుకోవడం క్రీడా రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. సచిన్ సోదరుడు అజిత్ పెట్టిన ఏకైక నిబంధన ఏంటంటే

తెలుగు సినిమా చరిత్రను 'మల్లీశ్వరి ముందు.. మల్లీశ్వరి తర్వాత' అని విభజించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1951లో విడుదలైన ఈ అద్భుత కావ్యం.. కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, వెండితెరపై ఆవిష్కృతమైన ఒక స్వచ్ఛమైన కావ్య రసగుళిక. విజయా పిక్చర్స్ పతాకంపై నాగిరెడ్డి-చక్రపాణిల నిర్మాణ సారథ్యంలో, దర్శక రత్న బి.ఎన్. రెడ్డి మలచిన ఈ సినిమా ఎందరో దర్శకులకు, కళాకారులకు ఇప్పటికీ ఒక మార్గదర్శిగా నిలిచిపోతుంది. సీనియర్ ఎన్.టి.రామారావు, భానుమతిల అద్భుతమైన అభినయం, డి.వి. నరసరాజు కథనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో జరిగే ఒక అందమైన ప్రేమకథే 'మల్లీశ్వరి'. కాకాని గ్రామానికి చెందిన నాగరాజు (ఎన్.టి.ఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి నుండి ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరుగుతారు. బావమరదళ్లైన వీరిద్దరి నడుమ చిగురించిన అనురాగం, పెరిగి పెద్దదయ్యాక గాఢమైన ప్రేమగా మారుతుంది. అయితే, మల్లీశ్వరి మేనత్త నాగమ్మ(ఋష్యేంద్రమణి) ఆమెకు రాజ్యసభలో 'రాజకన్య' హోదా లభిస్తే వచ్చే సంపదపై ఆశపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో రాయలవారి ఆస్థానానికి చెందిన అధికారులు మల్లీశ్వరిని విజయనగర రాజప్రసాదానికి 'రాజకన్య'గా ఎంపిక చేసి తీసుకెళ్తారు. ఆనాటి నిబంధనల ప్రకారం రాజకన్యగా ఎంపికైన స్త్రీ ఎవరినీ ప్రేమించకూడదు, వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ఆ నిబంధన మీరితే మరణశిక్ష విధించబడుతుంది. తన మల్లీశ్వరిని దూరమైన నాగరాజు ఆమెను వెతుక్కుంటూ విజయనగరం చేరుకుంటాడు. శిల్పిగా మారి రాజప్రసాదంలోకి అడుగుపెడతాడు. అక్కడ వారిద్దరూ కలుసుకున్నారా? వారి ప్రేమ ఫలించిందా? శ్రీకృష్ణదేవరాయలు వారి ప్రేమను గుర్తించి ఏం చేశారు? అనేదే మిగిలిన కథ. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో వచ్చిన అతిముఖ్యమైన చిత్రాల్లో మల్లీశ్వరి ఒకటి. అమాయకత్వం, ప్రేమ, విరహం, ఆవేదనల సమ్మేళనంగా నాగరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. ముఖ్యంగా భానుమతితో పోటీపడి నటించారు. ఆమెకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైనా.. ప్రేమ సన్నీవేశాలు, ఆర్ స్క్రీన్ రొమాన్స్

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత నిధులు ఇస్తానన్న బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఆ డబ్బుతో దీక్షాపరుల మండపం, నిత్యకల్యాణ మండపం,వరంగల్-హైదరాబాద్ హైవేపై స్వాగత తోరణాల నిర్మాణం కొండపై శంఖు, చక్ర, నామాలతో విద్యుత్ బోర్డు ఏర్పాటుకు రూ.85లక్షలు ఇస్తానన్న కొణిదెల సురేఖ ఆలయ అభివృద్ధికి ట్రస్టు బోర్డు పలు కీలక నిర్ణయాలు యాదాద్రి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన ట్రస్టు బోర్డు సమావేశమైంది. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలను సత్యనారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల దీక్షలు చేపట్టే భక్తుల కోసం కొండపై విష్ణుపుష్కరిణి వద్ద దీక్షాపరుల మండపం, స్వామివారి నిత్యకల్యాణ మండపం, హైదరాబాద్-వరంగల్ హైవేపై రాయిగిరి వద్ద స్వాగత తోరణ నిర్మాణాలను రూ.55.95కోట్లతో చేపట్టడానికి ట్రస్ట్ బోర్టు ఆమోదించింది. ఈ మూడు నిర్మాణాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులను అందిస్తున్నట్లుగా ప్రకటించారు. కొండపై శంఖు, చక్ర, నామాల విద్యుత్ బల్బుల బోర్డును పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.85లక్షలను సమకూర్చడానికి ధర్మకర్త కొణిదెల సురేఖ ముందుకు వచ్చారు. మరోవైపు, పెద్దగుట్ట టెంపుల్ సిటీపై వేదపాఠశాల, విశ్వవిద్యాలయంతో పాటు 40ఎకరాల్లో మోడల్ గోశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. స్వామివారి భక్తులకు ప్రస్తుతం అందిస్తున్న అన్నప్రసాదాన్ని 2వేల మందికి పెంచారు. తిరుమల తరహాలో టీసీఎస్ సహకారలంతో ఆన్లైన్ సేవలు, టికెట్ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారు. ఇక ఆలయ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం కోసం ఐఎస్బీఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) సంస్థను కన్సల్టెంట్‌గా నియమించడానికి ట్రస్టు బోర్డు ఆమోదం తెలియజేసింది. దేవస్థాన విద్యుత్ వినియోగ వ్యయభారం తగ్గింపు కోసం 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆగస్టు 17న దేశంలోని అన్ని యూనిట్లు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని బీఎంఎస్ కేంద్ర కార్యవర్గం సూచించింది.ఇటీవల రాంచీలో జరిగిన బీఎంఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్ర యూనిట్లు, 42 పారిశ్రామిక సమాఖ్యలు జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించింది.జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలుఆగస్టు 17న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టి.. అనంతరం జిల్లా అధికారుల ద్వారా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, కార్మిక శాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించాలని బీఎంఎస్ పిలుపునిచ్చింది.కార్మికులకు సంబంధించిన పలు అంశాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సంఘం డిమాండ్ చేస్తోంది.కనీస పెన్షన్ రూ.7,500కు పెంచాలని డిమాండ్బీఎంఎస్ ప్రధాన డిమాండ్లలో EPS-95 కింద కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచడం ఒకటి. అలాగే ఈ పెన్షన్‌కు VDA, ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను అనుసంధానం చేయాలని కోరుతోంది.దీంతో పాటు ESIకి సంబంధించిన వేతన పరిమితిని రూ.21,000 నుంచి రూ.42,000కు పెంచాలని బీఎంఎస్ డిమాండ్ చేస్తోంది.EPF పరిమితి పెంపుపైనా డిమాండ్ప్రస్తుతం ఉన్న EPF వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.30,000కు పెంచాలని కార్మిక సంఘం కోరుతోంది. కొత్త కార్మిక చట్టాల ప్రకారం నోటిఫై చేసిన విధంగా పూర్తి వేతనం లేదా జీతంపై బోనస్‌ను సంబంధిత ప్రభుత్వాలు ప్రకటించాలని డిమాండ్ చేసింది.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని బీఎంఎస్ కోరుతోంది. ఆగస్టు 17న దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసనల ద్వారా తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సంఘం నిర్ణయించింది

సామాన్యుడి జేబులోని చిల్లర నాణెం నుంచి దేశ ఆర్థిక శక్తిని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టే ప్రతీక వరకు.. మన రూపాయి సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన అధ్యాయం. భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న ఈ చారిత్రక తరుణంలో, మన చేతుల్లో మెదిలే కరెన్సీ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆసక్తికరమైన ఎన్నో సత్యాలు వెలుగులోకి వస్తాయి.ఒకప్పుడు సంస్థానాల రాజముద్రలతో, వేర్వేరు పరిమాణాల్లో చెలామణి అయిన రాగి నాణేలు, వెండి నాణేల స్థానంలో.. నేడు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిజిటల్ సంతకంగా మారిన డిజిటల్ రూపాయి వరకు మన రూపాయి సాధించిన పురోగతి అసాధారణం.రాజభవంతుల నాణేల నుంచి ఏకీకృత వ్యవస్థ వైపు..1947కి పూర్వం భారతదేశం ఆర్థికంగా, భౌగోళికంగా ఎన్నో ముక్కలుగా ఉండేది. హైదరాబాద్ నైజాం నాణేల నుంచి మరాఠాల కరెన్సీ వరకు ప్రతి రాచరిక ప్రాంతానికి సొంత నాణేల వ్యవస్థ ఉండేది. అయితే, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే క్రమంలో ఆర్థిక సమగ్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది.1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావంతో కరెన్సీ జారీ హక్కులన్నీ ఒకే కేంద్రీకృత వ్యవస్థ కిందకు వచ్చాయి. అంతకుముందు ప్రైవేటు బ్యాంకులు, ప్రెసిడెన్సీ బ్యాంకులు ముద్రించే నోట్లకు చరమగీతం పడుతూ, 1861 నాటి పేపర్ కరెన్సీ యాక్ట్ ద్వారా ప్రభుత్వమే నేరుగా నోట్లను చలామణిలోకి తెచ్చింది.ఒక్క రూపాయి నోటు వెనుక ఉన్న అసలు కథ!మనదేశంలో చలామణి అయ్యే ప్రతి నోటుపైనా ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది.. కానీ, ఒకే ఒక్క రూపాయి నోటుపై మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రమైన వెండి కొరత ఏర్పడింది. నాణేలను ముద్రించడం సాధ్యం కాక, బ్రిటన్‌లో ఐదో జార్జ్ రాజు చిత్రంతో మొదటిసారిగా కాగితపు రూ.1 నోటును ముద్రించారు.స్వాతంత్ర్యం వచ్చాక 1949లో బ్రిటీష్ రాజు బొమ్మ స్థానంలో సారనాథ్
EPS Pension: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోని ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 (EPS-1995) కింద లభించే కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నెలకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7500లకు పెంచాలని కోరుతున్నారు. అలాగే కరువు భత్యం (Dearness Allowance) అందించాలనే డిమాండ్ ఉంది. ఈ అంశంపై మరోసారి పార్లమెంటులో చర్చకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.ఈపీఎస్ 95 కింద అందించే కనీస పెన్షన్ రూ.7500లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5, 2026 రోజున ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధరలకు ఇస్తోన్న కనీస పెన్షన్ రూ.1000 అనేది సరిపోవడం లేదని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని కోరారు. ఆగస్టు 10, 2026 సోమవారం రోజున ఈ అంశంపై లోక్‌సభలోనూ చర్చకు వచ్చింది. పార్లమెంట్ సభ్యుడు రామ్‌వీర్ సింగ్ బిధూరీ ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఈపీఎస్ 1995 పరిధిలో ఎంత మందికి అధిక పెన్షన్ అవకాశం కల్పించారని ప్రశ్నించారు.కేంద్రం సమాధానం ఇదేఎంపీ బిధూరి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లేజ్ సమాధానం ఇచ్చారు. కనీస ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అనే అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కేంద్రం వైఖరిని వెల్లడించారు. ఉద్యోగులకు వేతనంపై అదనంగా 1.16 మద్దతు ఇస్తూనే ఈపీఎస్ పెన్షన్ అందిస్తోందని స్పష్టం చేశారు. ' ఎంప్లాయిస్ పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగి వేతనంలో 8.33 శాతం కాంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16 శాతం కాంట్రిబ్యూషన్తో కలిపి ఉంటుంది. అలాంటి లెక్కలన్నింటిని తీసుకుని అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాం. ఈపీఎస్ 1995, ప్యారా 32

తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం ‘సర్’ ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో (Telangana SIR Process) 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈరోజు (సోమవారం) ‘సర్’ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. డిజిటలైజేషన్లో హైదరాబాద్ 58.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ – మల్కాజిగిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతం రికార్డైంది. అత్యధిక డిజిటలైజేషన్‌తో యాదాద్రి భువనగిరి 94.30 తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లో 89.45 శాతం, జగిత్యాలలో 89.60 శాతం పూర్తి అయింది. రెండు సార్లు గడువు పొడిగించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పెరగలేదు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్ సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్