.webp)
వందేమాతరం వివాదం.. రాజకీయ దుమారం
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజల్లో దేశభక్తి రగిలించిన జాతీయ గేయం వందేమాతరం చుట్టూ మళ్లీ రాజకీయ దుమారం చెలరేగింది. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయమైన ఇందిరా భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.పంద్రాగస్టు వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ గేయం పాడుతున్న సమయంలో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు ఆ ఆరోపణలను, విమర్శలను ఖండించాయి. ఈ వివాదం కేవలం ఒక రోజు కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకుండా, వందేమాతరం గేయానికి ఉన్న చారిత్రక నేపథ్యం, మతపరమైన భిన్నాభిప్రాయాలు, ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టం నిబంధనలపై కూడా పునరాలోచనకు దారితీసింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వందేమాతరం గేయాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడం ప్రారంభించారు. గేయం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంజ్ఞలు చేయడం, అనంతరం రాహుల్ గాంధీ కూడా ఆ సంజ్ఞలను అనుసరించడం కేమెరాలలో కనిపించింది. ఇందేరే సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బీజేపీ.. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గేయాన్ని పూర్తిగా పాడటానికి ఇష్టపడలేదని, అందుకే దానిని మధ్యలోనే నిలిపివేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు చేసింది. అయితే కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మల్లికార్జున్ ఖర్గే వయోభారం వల్ల చాలా సేపు నిలబడలేకపోయారని, ఆయనకు కుర్చీ తీసుకురావాల్సిందిగా మాత్రమే సోనియా గాంధీ సూచించారని, వందేమాతరాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఒక కీలకమైన చట్టపరమైన నిర్ణయం తీసుకున్నాయి. జాతీయ గౌరవానికి భంగం కలిగించే నిరోధక సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1971 నాటి పాత చట్టానికి చేసిన ఈ సవరణ ద్వారా వందేమాతరం ఆలపించే సమయంలో