
తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి.. హిట్టా.. ఫట్టా? సంచలన నిర్ణయాలివే
TVK Vijay Government Completes 100 Days in Tamil Nadu : తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయ్‌కు అధికారం చేపట్టేందుకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవటంతో కాంగ్రెస్‌సహా ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. కాగా.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల పాలనలో విజయ్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఏ మేరకు హామీలను అమలు చేశారు.. 100రోజుల విజయ్ పాలన ఎలా ఉందనే విషయాలను పరిశీలిద్దాం.. విజయ్ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సినిమాలో 100వ రోజు విజయానికి సంకేతమైతే.. రాజకీయాల్లో మాత్రం అది పాలనకు తొలి పరీక్ష. అయితే, ఈ వంద రోజుల పాలనలో సీఎం విజయ్ అవినీతి నిర్మూలపై ప్రత్యేక దృష్టిసారించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను టీవీకే సర్కార్ చేపట్టింది. మంచి పాలన అంటే కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేయడం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, అధికార వ్యవస్థలో జవాబుదారీతనం, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందడం కూడా కీలకమే. ముఖ్యమంత్రి విజయ్ అవినీతిని అంతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా కేవలం రూ. 1,000 లంచం డిమాండ్ చేసినా, ఆడియో లేదా వీడియో సాక్ష్యాలతో ఫిర్యాదు చేసే పౌరులకు రూ. 1,00,000 నగదు బహుమతి ప్రకటిస్తూ విజయ్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. అవినీతి ఫిర్యాదుల స్వీకరణ కోసం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ వేదికలను అందుబాటులోకి తెచ్చారు. అవినీతికి పాల్పడితే మంత్రులైనా, అధికారులైనా ఎలాంటి