
© 2026 nimisham.in


Vaishnavi Chaitanya : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు హీరోయిన్ వైష్ణవి చైతన్య మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
వైష్ణవి చైతన్య ఎపిక్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఆనంద్ పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి. ప్రతి ఒక్కరిలో కడలి పాత్ర ఉంటుంది. కానీ కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలిసి లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. కడలి పాత్ర ద్వారా ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి అని నేర్చుకున్నాను. ఒక సముద్రం లాంటి అమ్మాయి తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళింది అనేది ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా ఫ్యామిలీస్ తో చూడొచ్చు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి ఈ సినిమాలో ఉంటుంది కాబట్టి 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు కానీ దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అంతే చూపించారు అని తెలిపింది.
Also See : Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య వయ్యారాలు.. ఎపిక్ ప్రమోషన్స్‌లో సందడి..
దర్శకుడు ఆదిత్య హాసన్, నిర్మాత నాగవంశీ గురించి మాట్లాడుతూ.. ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. ఆదిత్యతో నాకు ముందు పరిచయం లేదు. ఎపిక్ కథ చెప్పడానికి వచ్చినప్పుడే మొదటిసారి కలిశాను. అప్పటికే 90s వెబ్ సిరీస్ చూసాను. ఆ సిరీస్ నాకు ఎంతగానో నచ్చింది. సితార బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నాగవంశీ గారు అందరికీ ఫ్రీడమ్ ఇస్తారు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ఇదే ప్రొడక్షన్ లో చెల్లి పాత్ర చేసి ఇప్పుడు ఇదే బ్యానర్ లో హీరోయిన్ గా చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
బేబీ తర్వాత కథల ఎంపిక గురించి మాట్లాడుతూ.. కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. బేబీ, ఎపిక్ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ఈ సినిమాలో మమ్మల్ని చూస్తున్నప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే మేము విజయం సాధించినట్టే. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత ఎపిక్ ఫైనల్ సెమిస్టర్ సినిమా కూడా ఉంది. అలాగే సితార బ్యానర్ లోనే నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు.
Also Read : Epic Trailer : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ ట్రైలర్ వచ్చేసింది.. రష్మిక చేతుల మీదుగా రిలీజ్..
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.




