
Aug 15 2026 11:59 AM | Updated on Aug 15 2026 11:59 AM
కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జూలై 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. కేవలం మౌత్ టాక్‌తో వసూళ్లు రాబట్టింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 21 నుంచే సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్.
కాలేజ్ రోజుల నుంచే అజయ్ (త్రిగుణ్), నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమతో పెళ్లికి సిద్దం అవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిస అవుతుంది. ఆఫీసులో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూంలోకి ఓ అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). అనాథ అయిన స్టీవెన్.. ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చచ్చేలోపు ఒక్కసారి అయినా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులు ఏంటి? నివి, స్టీవెన్ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వస్తాడా? చివరకు ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటి అవుతారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం రద్దీ (ఫొటోలు)
'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు)
జెన్‌జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు)
అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)
అనంతపురంలో హైటెన్షన్.. 15 గంటల పాటు హైడ్రామా.. లాయర్ గౌతంరాజుకి సీఐ క్షమాపణ
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
కెవ్వు కేక... ఈ సారి అమిత్ షా కాళ్ళు పట్టుకున్న సరే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు
YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు





