
Aug 15 2026 6:50 PM | Updated on Aug 15 2026 7:02 PM
సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేది ప్రతీది అబద్దమేనని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఆయన అబద్ధాలే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పరని, ఆయనొక ఘరానా మోసగాడని ధ్వజమెత్తారు. రేవంత్‌కు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 15వ తేదీ) సిద్ధిపేట నుంచి మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్‌రావు.. రేవంత్‌పై ధ్వజమెత్తారు.
‘దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చెయ్యాలి. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. రేవంత్‌రెడ్డి ఘరానా మోసగాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పాలి. ఆనాడు రూ. 1400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెడితే మేం కట్టాం. పిల్లలకు క్షమాపణలు చెబుతావా.. ముక్కు నేలకు రాస్తావా?, నిరుద్యోగుల గురించి రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. గన్మెన్లు లేకుండా అశోక్‌నగర్‌కు రాగలవా? అని నిలదీశారు.
‘కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు కంటే రేవంత్ తక్కువ ఇచ్చారు. రూ. 15 వేల కోట్లు రైతు బంధు రేవంత్ ఎగ్గొట్టాడు. 2025-26లో మీరు ఇచ్చింది కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమే. ఇది తప్పు అయితే ముక్కు నేలకు రాస్తా. రేవంత్‌కు ఇదే నా సవాల్. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. 2 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి యువతను మోసం చేశావు. మూడేళ్లలో 16వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌ను కోర్టుకు ఈడుస్తా. నాపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలి. పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగుతా. రైతుబంధు, రుణమాఫీపై దమ్ముంటే అసెంబ్లీ చర్చింద్దాం. కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మీ అవినీతిపై పోచారం, రాజగోపాల్ెడ్డి మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రేవంత్‌కు ఊరికే వెళ్దాం. అందరికీ రుణమాఫీ అయితే అక్కడే రాజీనామా చేస్తా. రుణమాఫీ కాలేదంటే రేవంత్ రాజీనామా చేస్తారా?అని సవాల్ విసిరారు.
ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు)
‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు)
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు
'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు)
బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే
నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా
మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..!
మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా





