
సౌర కుటుంబంలో చోటుచేసుకునే ఖగోళ మార్పులకు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా గ్రహణాల సమయంలో జరిగే గ్రహాల కదలికలు ద్వాదశ రాశులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఆగస్టు 12న ఏర్పడుతున్న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని మోసుకొస్తోంది. పవిత్రమైన అమావాస్య తిథి నాడు ఏర్పడుతున్న ఈ గ్రహణం కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభించి, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13న తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుంది. అయితే, మన దేశంలో ఈ గ్రహణం రాత్రి వేళ సంభవించడం వల్ల భారత్‌లో ఇది కనిపించదు. ఈ కారణంతోనే సూతక కాలం నిబంధనలు లేదా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. కానీ, గ్రహాల కదలికల ఆధారంగా ఈ 4 రాశుల వారి జాతకం మాత్రం ఊహించని విధంగా మారబోతోంది.తులారాశి, వృశ్చిక రాశి ఆగస్టు నెల జాతక ఫలంసింహ రాశిసింహ రాశికి అధిపతి స్వయంగా సూర్యభగవానుడే కావడంతో, ఈ గ్రహణ ప్రభావం వీరికి ఎంతో శుభప్రదంగా మారనుంది. ఆఫీసులో మీ నాయకత్వ నైపుణ్యాలకు, కష్టపడే తత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో హోదా, కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి అదృష్టం కలిసివచ్చి బంపర్ ప్రాఫిట్స్ తెచ్చే భారీ డీల్స్ కుదిరే అవకాశాలున్నాయి.ధనూ రాశిధనూ రాశి వారికి ఈ గ్రహణ సమయం విపరీతమైన పురోగతిని అందిస్తుంది. ఉద్యోగ వ్యాపార రీత్యా చేపట్టిన విదేశీ ప్రయాణాలు విపరీతమైన ధనలాభాలను, విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు.మిథున రాశి, కర్కాటక రాశి ఆగస్టు నెల పూర్తి జాతక ఫలం వివరాలుమేష రాశిమేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం వృత్తి, ఆర్థిక రంగాల్లో కొత్త వెలుగులు నింపనుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు ఊహించని ప్యాకేజీతో ఆకర్షణీయమైన కొత్త అవకాశాలు వస్తాయి. కోరుకున్న కోరికలు ఈజీగా నెరవేరుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది.మిథున రాశిమిథున రాశి వారికి ఈ సమయం లక్ష్మీకటాక్షాన్ని కలిగిస్తుంది. ఊహించని ధనలాభం కలిగి ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. గతంలో ఇతరులకు ఇచ్చి రావాల్సిన మొండి బాకీలు సులభంగా చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ లేదా ప్రాపర్టీ రంగానికి సంబంధించి ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.





