
ఎనిమిదినెలల పిల్లాడి డైపర్లో అక్రమంగా తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన కేరళంలోని కరిపుర్ (కాలికట్) విమానాశ్రయంలో వెలుగుచూసింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమా నుంచి ఓ వ్యక్తి ముగ్గురు చిన్నారులతో మంగళవారం రాత్రి ఎయిర్పోర్టులో దిగాడు. అధికారులు తనిఖీలు చేపట్టగా బాలుడితో పాటు తండ్రి వద్ద సైతం మరింత బంగారం దొరికింది. మొత్తం గోల్డ్ విలువ రూ.కోటి ఉంటుందని అధికారులు చెప్పారు. శిశువు డైపర్లో రూ.50 లక్షల విలువైన బంగారం |
S
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.





