Income Tax: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్. విదేశీ ఆస్తుల వివరాలు తమ ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారి కోసం వన్-టైమ్ విండో (One Time Window)ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలిపింది. ఈ విండో ఆగస్టు 16వ తేదీన అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ట్యాక్స్ పేయర్ల పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు, ఆభరణాలు, లిస్టెడ్, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీలు వంటి విదేశీ ఆస్తులను ఈ పథకం కింద పరిగణనించనున్నారు. విదేశీ ఆస్తులను వెల్లడించని ట్యాక్స్ పేయర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.రూ.1 కోటి వరకు విదేశీ ఆస్తులు లేదా ఆదాయం ఉన్నప్పటికీ ఆ వివరాలను తమ ఐటీఆర్ (Income Tax Return)ల్లో పేర్కొనని ట్యాక్స్ పేయర్లకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే రూ.5 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులు ఉండి వివరాలు చెప్పని వారికి సైతం అవకాశం ఇస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీలోపు ఫారమ్-1 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని ఐటీ శాఖ తెలిపింది.30 +30 శాతం ట్యాక్స్‌రూ.1 కోటి వరకు ఆస్తులు లేదా ఆదాయం ఉన్నట్లయితే ఐటీ రిటర్నులు ఫైల్ చేయనివారు మొత్తం 60 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. (30 శాతం ట్యాక్స్‌తో పాటు, దానికి సమానంగా 30 శాతం అదనపు పన్ను కట్టాలి). ఇక రూ.5 కోట్ల విదేశీ ఆదాయం ఉంటే ట్యాక్స్ చెల్లించినప్పటికీ ఎన్ఆర్ఐగా ఉన్న టైమ్ లో ఆయా ఆస్తులను ఐటీ రిటర్నుల్లో చూపించకపోతే వారు రూ.1 లక్ష ఫ్లాట్ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.ట్యాక్స్ పేయర్లు ఏం చేయాలి?ట్యాక్స్ పేయర్లు ఫారమ్-1 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. ఆ తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని ఫారమ్-2 ద్వారా ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నుంచి సమాచారం వస్తుంది. నోటీసు వచ్చిన 2 నెలల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ చెల్లింపులు ఆలస్యమైతే నెలకు 1 శాతం చొప్పున అదనపు వడ్డీ భారం పడుతుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం లేదా నల్లధన చట్టాల కింద ఇప్పటికే కేసులు, విచారణ ఎదుర్కొంటున్న ఆస్తులకు ఈ స్కీమ్ వర్తించదని స్పష్టం చేసింది.ఎవరెవరు వెల్లడించాలి?భారతదేశ పన్ను నివాసితులుగా ఉన్న వ్యక్తులు విదేశాల్లో ఉన్న బ్యాంకు అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదా స్థిరాస్తుల వివరాలను ఐటీఆర్ లో కచ్చితంగా పేర్కొనవలసి ఉంటుంది. ఈ ఆస్తులు, ఆదాయల వివరాలు గతంలో ఐటీఆర్‌లో వెల్లడించకపోతేఈ పథకం కింద నిర్ణీత శాతం పన్ను, పెనాల్టీలు చెల్లించడం ద్వారా చట్టబద్ధం చేసుకోవచ్చు.





