పిల్లల పెంపకంలో సాధారణంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు చదువుతో పాటు ఇంటి పనులు నేర్పించాలని చూస్తారు. కానీ మారుతున్న నేటి సమాజంలో ఈ నైపుణ్యాలు మగపిల్లలకు కూడా అంతే అవసరం. నేడు కుటుంబ బాధ్యతలు కేవలం ఒకరిపైనే ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ సమానంగా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. "పెళ్లయ్యాక కోడలు వచ్చి అన్నీ చూసుకుంటుంది" అనే పాతకాలపు ఆలోచనలకు ప్రస్తుత రోజుల్లో తావు లేదు. వర్కింగ్ వుమెన్ మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ సమాన బాధ్యతల్ని కోరుకుంటున్నారు. అందుకే కొడుకులను స్వావలంబన గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి చిన్నతనం నుంచే కొన్ని ప్రాథమిక పనులు నేర్పించాలి. నిపుణుల ప్రకారం కొడుకులకు తప్పక నేర్పించాల్సిన 5 ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చుద్దాం.1. వంట చేయడం (బేసిక్ కుకింగ్) వంట అనేది ఒక లింగానికి చెందిన పని కాదు, అది బతకడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యం (Life Skill). కేవలం మ్యాగీ చేయడం వస్తే సరిపోదు. అన్నం, పప్పు, కూరగాయలు, రొట్టె లేదా కనీసం కిచిడీ వంటివి రుచిగా, శుభ్రంగా చేయడం నేర్పించాలి. ఇది వారికి విద్యార్థి దశలోనూ, భవిష్యత్తులో ఒంటరిగా ఉన్నప్పుడూ ఎంతగానో ఉపయోగపడుతుంది.2. బట్టలు ఉతకడం, ఆరేయడం, ఐరన్ చేయడం తమ సొంత బట్టలను వాషింగ్ మెషీన్లో వేయడం (లేదా చేత్తో ఉతకడం), ఆరేయడం, మడతపెట్టి కబోర్డులో అమర్చుకోవడం నేర్పించాలి. అలాగే అత్యవసరమైనప్పుడు సొంతంగా బట్టలు ఐరన్ చేసుకోవడం నేర్పిస్తే, ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.3. గదిని శుభ్రంగా, సర్ది ఉంచుకోవడం చాలామంది మగపిల్లలకు వస్తువులను తీసిన చోట తిరిగి పెట్టే అలవాటు ఉండదు. ఈ విషయంలో చాలా వస్తువులను చిందరవందరగా పడేయకుండా ఒక పద్ధతిలో ఉంచుకోవడం, దుమ్ము దులపడం, బెడ్షీట్ సర్దుకోవడం, అవసరమైనప్పుడు చీపురు పట్టి ఊడ్వడం వంటివి అలవాటు చేయాలి. ఇది వారిలో పరిశుభ్రతను, బాధ్యతను పెంచుతుంది.4. ఇంటి నిర్వహణ, సరుకుల లెక్కలు మార్కెట్కు వెళ్లి నాణ్యమైన కూరగాయలు, పాలు, కిరాణా సరుకులు తేవడం కూడా అబ్బాయిలకు నేర్చించాలి. అంతేకాకుండా వాటి ఖర్చుల లెక్కలు రాయడం నేర్పించాలి. ఇంట్లో పనిమనుషులు లేదా సహాయకులతో మర్యాదగా ప్రవర్తించడం, వారికి సరైన సమయానికి జీతాలు చెల్లించడం వంటి పనుల్లో కూడా వారిని భాగస్వాముల్ని చేయాలి. అలా అయితేనే రేపు భర్త కాగానే కుటుంబాన్ని సరిగ్గా ఎలా నిర్వహించాలో తెలుసుకుంటాడు.5. సొంతంగా లగేజ్ సర్దుకోవడం (ప్యాకింగ్) ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మో, భార్యో బ్యాగ్ సర్దుతారులే అనే భావనను మార్చాలి. అవసరమైన దుస్తులు, మందులు, వస్తువుల్ని గుర్తుపెట్టుకుని సొంతంగా బ్యాగ్లో ప్యాక్ చేసుకునే స్వాతంత్ర్యం ఇవ్వాలి. వాళ్ల చేత సొంతంగా లగేజ్ సర్దుకోవడం నేర్పించాలి. చిన్నతనం నుంచే అబ్బాయిలకి ఈ అలవాటు నేర్పిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు.ఈ విషయాలు కూడా ముఖ్యమేనండి! ప్రాథమిక ఆరోగ్య రక్షణ: జ్వరం, జలుబు, చిన్నపాటి గాయాలు అయినప్పుడు తీసుకోవాల్సిన ఫస్ట్-ఎయిడ్, బేసిక్ మెడిసిన్స్ వాడకంపై అవగాహన కల్పించాలి. ఆర్థిక నిర్వహణ: చిన్న వయసు నుంచే పాకెట్ మనీ ఖర్చులను లెక్కించడం, పొదుపు చేయడం, యుటిలిటీ బిల్లులు (కరెంట్ బిల్లు, గ్యాస్ సిలిండర్ బుకింగ్, ఇంటర్నెట్ రీఛార్జ్) స్వయంగా చెల్లించడం నేర్పించాలి. భావోద్వేగ పరిపక్వత: పనుల్ని పంచుకోవడంలో చిన్నతనం లేదని, పని చేయడం ద్వారా ఇతరులకు గౌరవం ఇస్తున్నామని అర్థం చేసుకునే మానసిక దృక్పథాన్ని అలవర్చాలి. ఇలాంటి ప్రాథమిక బాధ్యతల్ని చిన్నతనం నుంచే అలవాటు చేయడం వల్ల కొడుకులు భవిష్యత్తులో మంచి భర్తలుగా మాత్రమే కాకుండా, ఎవరి మీదా ఆధారపడని బలమైన, స్వతంత్ర వ్యక్తులుగా ఎదుగుతారు.గమనికఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది.తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Share this story
Help others stay updated with verified breaking news and insights.










