చాలా రోజుల తరువాత నర్మద కొప్పులో మల్లెపూలు పెట్టి ప్రేమ కురిపిస్తాడు సాగర్. దొరగారికి ప్రేమ పొంగుకొస్తుందేంటో అని తెగ మురిసిపోతూ.. ‘నిన్నా మొన్నా నాలోనా’ అంటూ సాంగ్ వేసుకుంటుంది. ఆ తరువాత ఇద్దరూ రొమాన్స్‌లో మునిగిపోతారు. ఏమాట కామాటే కానీ.. ఇంతకు ముందు రొమాంటిక్ సీన్ అంటే నర్మద చింపేసేది కానీ.. సాగర్ కాస్త ఇబ్బంది పడుతూ చేసేవాడు. కానీ ఈసారి మాత్రం మనోడు రాటుదేలినట్టుగానే రెచ్చిపోయాడు. నటించరా బాబూ అంటూ నర్మదని మీదికి లాక్కుని రెచ్చిపోయాడు. మల్లెపూల కంటే నీ కళ్లే చాలా మత్తుగా కనిపిస్తున్నాయి.. నీ స్వాస కూడా పరిమళం వెదజల్లుతుంది.. పెదాలు కూడా మాట్లాడుతున్నాయి.. గుర్తుండిపోయేలా జీవిత సంతకం చేయమని అంటూ మీదికి లాక్కుని ముద్దుపెట్టేస్తాడు సాగర్. ఆ తరువాత మరో సాంగ్ వేసుకుని అలా లైట్లు ఆర్పేస్తారు. ఇటు ధీరజ్.. రాత్రి పూట ప్రేమని వెతుక్కుంటూ భద్రావతి ఇంట్లోకి అడుగుపెడతాడు రహస్యంగా. మొత్తానికి అతి కష్టంపై ప్రేమ గదిని వెతుక్కుంటూ ప్రేమ దగ్గరకు వెళ్తాడు. నేను దీని కోసం ఇంత కష్టపడి గోడలు దూకి వస్తుంటే.. ఇది ప్రశాంతంగా పాటలు వింటుందా? ఏం పాటలు వింటుందబ్బా అంటూ ఆమె ఇయర్ ఫోన్స్ ఒకటి తీసి వింటాడు. మగాళ్లు ఒట్టి మాయగాళ్లే అంటూ పాటను పెట్టుకుని వింటూ పడుకుంటుందన్నమాట ప్రేమ.అసలేమైందీ.. ఆహా బావుందిగా వీళ్లపని అది విన్న ధీరజ్.. ‘ఏంటీ నేను మాయగాడినా? అంటూ బిత్తరపోతాడు. ఇంతలో ప్రేమ నిద్రలో నుంచి లేచి కూర్చొంటుంది. ఎదురుగా ధీరజ్ని చూసి కెవ్వుమంటుంది. దాంతో ధీరజ్.. ఆమెకి ముద్దు పెట్టేస్తాడు. ఆ తరువాత సాంగ్ స్టార్ట్. ‘అసలేమైందీ.. కన్నెమనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో వాలిందీ’ అంటూ సాంగ్ వేసుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాస్త తేరుకున్న ప్రేమ.. ధీరజ్ని తోసిపారేస్తుంది. సచ్చినోడా నా గదిలోకే వస్తావ్ రా.. పోరా అంటూ చితకబాదుతుంది. నేను చెప్పేది విను ప్రేమా అంటూ అడ్డుకునే ప్రయత్నంలో ప్రేమని గట్టిగా పట్టుకుంటాడు. ఆ తరువాత మళ్లీ సాంగ్ కంటిన్యూ.. కానరాని గుండెలోకీ కన్నమేసి వచ్చావూ అంటూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. సచ్చినోడా నాకు తెలుసురా నీకు ఆ ఆలోచన ఉందనీ.. రేయ్ సచ్చినోడా ముద్దు ఎందుకు పెట్టావ్ రా.. అని అంటుంది ప్రేమ. ‘నోరు మూయడం కోసం’ అని అంటాడు ధీరజ్. సచ్చినోడా.. నీ మనసులో ఆ ఆలోచన ఉందన్నమాట అని అంటుంది ప్రేమ. ‘నీతో మాట్లాడటం కోసం చాలా కష్టపడి వచ్చానే’ అని అంటాడు ధీరజ్. ‘అసలు మా ఇంటికి ఎందుకొచ్చావ్రా’ అని అంటుంది ప్రేమ. ‘దానికోసమే’ అని ధీరజ్ మెలికలు తిరగడంతో.. ‘నాకు తెలుసుకుని నీకు ఆ ఉద్దేశం ఉందని అని తిట్టిపారేస్తుంది ప్రేమ. అమ్మాయిల్ని పారేయడంలో నువ్వు మాస్టార్విరా.. ఆ ముగ్ధని అలా పడేశావ్ అని అంటుంది ప్రేమ. అబ్బా అది కాదే.. ఆరోజు నిన్ను కారు ఎక్కించడం కోసం సరదాగా అలా ముగ్ధతో చనువుగా ఉన్నట్టు యాక్ట్ చేశా. ఆహా.. సరదాగానా? ఇవి బుగ్గలా జిన్ను ముక్కలా అంటూ పట్టుకుని లాగడం సరదానా? అంటూ ధీరజ్ బుగ్గల్ని లాగేస్తుంది ప్రేమ. ఉండ్రా నీ సంగతి చెప్తా.. ‘అత్తా.. అత్తా.. అత్తా’ ప్రతిదీ బూతద్దంలో చూసి నన్ను అపార్థం చేసుకోబట్టే నువ్వు ఇలా ఉన్నావ్ అని అంటాడు ధీరజ్. ‘ఏంట్రా చేసిందంతా చేసి నువ్వు నన్ను అంటున్నావా? ఆరోజు బర్త్ డే ఫంక్షన్లో మా నాన్నని కొట్టావ్.. ఆ వెధవ ప్రస్తావన తెచ్చి నన్ను అవమానించావ్. చివరికి నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నావ్. ముగ్ధ అంటూ దాని బుగ్గలు గిల్లి.. ఇప్పుడు అది కూడా నాదే తప్పు అంటున్నావ్ అని మండిపడుతుంది ప్రేమ. ప్లీజ్ నీకు దండం పెడతాను.. ఇక ఆపవే అని అంటాడు ధీరజ్. ‘నువ్వు మారావ్ అని అనుకున్నా.. అందుకే ఇంతసేపు మాట్లాడాను. కానీ నా ముందు దాని పేరు కలవరిస్తున్నావ్.. ఉండు నీ సంగతి చెప్తాను’ అంటూ ఇంట్లో వాళ్లందర్నీ పిలుస్తుంటుంది ప్రేమ. దాంతో ధీరజ్.. అక్కడ నుంచి జంప్ అవుతాడు. నా ఉద్దేశం అది కాదు.. అటు తెల్లవారగానే నర్మద.. ‘రా ప్రేమా రా.. కుడికాలు అడుగుపెట్టి ఇంట్లోకి రా’ అని ధీరజ్‌కి వినిపించేట్టుగా అంటుంది. పాపం ధీరజ్.. నిజంగా వచ్చేసిందని ఇల్లు మొత్తం తెగ వెతికేస్తాడు. ఎందుకే పాపం వాడు అసలే ప్రేమ గురించి తపించిపోతుంటే నువ్వు వెటకారం చేస్తావ్ అని అంటుంది వేదవతి. ఏంటి వదినా నువ్వూ అంటూ ధీరజ్ నిరుత్సాహ పడతాడు. ‘నా ఉద్దేశం నా మరిదిని ఆటపట్టించడం కాదు.. ఇలా రెచ్చగొడితేనైనా పౌరుషంతో భార్యని ఇంటికి తీసుకొస్తాడనే ఇలా చేస్తున్నా’ అని అంటుంది వేదవతి. ‘వాడు అదే పనిలో ఉన్నాడు.. భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యని తీసుకుని రావడం అంటే అంత ఈజీ కాదు. కానీ నా కొడుకు మాత్రం ఖచ్చితంగా తీసుకుని వస్తాడు. రావడం ఆలస్యం కావొచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా ఇవాళ కాకపోతే రేపు.. ఆలస్యం కావొచ్చేమో కానీ.. తీసుకుని రావడం మాత్రం పక్కా.. చిన్నోడిపై నాకు నమ్మకం ఉంది అని అంటుంది వేదవతి. ప్రేమ వస్తే అందరికంటే ఆనందపడేది నేనే ముందు ఆ విషయం తెలుసుకోండి అత్తా అని అంటుంది నర్మద. దాంతో వేదవతి.. ధీరజ్ దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అవుతుంది. ‘రేయ్ చిన్నోడా నీకు తెలుసు కదా.. నీకు ప్రేమకి పెళ్లి చేసిన విషయం మీ నాన్న దగ్గర దాచిపెట్టానని ఆయన నాతో మాట్లాడటం లేదు. పెళ్లైన ఇన్నేళ్లలో ఆయన నాతో మాట్లాడకుండా ఉన్నది లేదు. ఆయన అలా ఉంటుంటే పిచ్చిదాన్ని అయిపోతున్నారా? ఆ బాధని తట్టుకుని మోయడం నా వల్ల కాదురా. మీ నాన్న ఎంత కోపం చూపించినా నేను భరించగలను. ఆయన మౌనాన్ని మాత్రం భరించే శక్తి నాకు లేదు. ఆలోపే నా బాధని దూరం చేయిరా.. వేదవతి కన్నీళ్లు ఆయన రెండు మూడురోజులకు ఓసారి ఇంటికి వస్తారు. ఈలోపే ప్రేమని ఇంటికి తీసుకుని రారా.. కోడలు తిరిగి వచ్చి కొడుకు కాపురం బావుందని మీ నాన్న సంతోష పడతారు. ఆ సంతోషంలోనైనా మీ నాన్నకి నాపై కోపం పోయి.. నాతో మాట్లాడతారు. అప్పుడు ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వేదవతి. ‘సరేనమ్మా.. నాన్న మాట్లాడరనే బాధని దూరం చేస్తాను.. మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాను’ అని అంటాడు ధీరజ్. దాంతో వేదవతి.. మా చిన్నోడు బంగారం అంటూ నుదుటన ముద్దాడుతుంది వేదవతి. ఊరుకోమ్మా అంటూ వేదవతిని ఓదార్చుతాడు ధీరజ్. ఇక రేపటి ఎపిసోడ్లో మళ్లీ ప్రేమ దగ్గరకు వెళ్తాడు ధీరజ్. ప్రేమగా ప్రేమ చేతికి గోరింటాకు పెడతాడు. అదే పెద్ద పెంటపెట్టింది. అదేంటో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.





