
Aug 18 2026 4:58 PM | Updated on Aug 18 2026 5:04 PM
బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్‌కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో కొత్తగా జట్లు చేర్చితే.. అందులో ఒక ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు నైట్ రైడర్స్ గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
గతేడాది ది హండ్రెడ్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీల్లో వాటాల విక్రయ ప్రక్రియ జరిగినప్పుడు నైట్ రైడర్స్ గ్రూప్ ట్రెంట్ రాకెట్స్‌పై ఆసక్తి చూపింది. అయితే బిడ్డింగ్ ప్రక్రియలో ఆ ఫ్రాంచైజీ విలువ కొంత ఎక్కువగా ఉందని భావించి, చివరికి రేసు నుంచి తప్పుకుంది.
దీంతో ట్రెంట్ రాకెట్స్‌లో 49 శాతం వాటాను కైన్ ఇంటర్నేషనల్ దక్కించుకుంది. చెల్సీ సహ యజమాని టాడ్ బోహ్లీ, బ్రిటిష్ వ్యాపారవేత్త జోనాథన్ గోల్డ్‌స్టీన్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ వాటాను 40 మిలియన్ పౌండ్ల కంటే తక్కువ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.
10 జట్లకు విస్తరిస్తే ఎంట్రీ..? బీబీసీ స్పోర్ట్ నివేదిక ప్రకారం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భవిష్యత్తులో ది హండ్రెడ్ను ఎనిమిది జట్ల నుంచి 10 జట్లకు విస్తరించాలని నిర్ణయిస్తే నైట్ రైడర్స్ గ్రూప్ మరోసారి బిడ్డింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుత మీడియా హక్కుల ఒప్పందం 2028 వరకు కొనసాగుతున్నందున.. అంతకుముందు కొత్త జట్లను చేర్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
కొత్తగా రెండు జట్లు వస్తే వాటికి డర్హమ్‌తో పాటు నైరుతి ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ లేదా టాంటన్ ప్రాంతాలను స్థావరాలుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. కొత్త జట్ల చేరికతో ది హండ్రెడ్ మీడియా హక్కుల విలువ కూడా పెరిగే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నైట్ రైడర్స్ విస్తరణ నైట్ రైడర్స్ గ్రూప్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో పలు ఫ్రాంచైజీలను నిర్వహిస్తోంది. భారత్‌లో (ఐపీఎల్) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు వెస్టిండీస్ (CPLలో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్), అమెరికా (MLCలో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్), యూఏఈల్లోనూ (ILT20లో అబుదాబీ నైట్‌రైడర్స్) ఫ్రాంచైజీలను కలిగి ఉంది. నైట్ రైడర్స్ యాజమాన్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సొంతంగా ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కలిగి ఉంది.
భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు)
జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)
న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత
'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు
కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్
రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద..





