
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
IND Vs SL Test Series: టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు పూర్తిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పై దృష్టి సారించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా.. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్లేందుకు భారత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.
భారత్ - శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఈ సిరీస్‌లో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు శ్రీలంకలోని ప్రముఖ వేదికల్లో జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత్, శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు జరగనుంది. అలాగే రాజధాని కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ఆగస్టు 27 రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
WTC పాయింట్ల పట్టిక దృష్ట్యా ప్రాధాన్యత ఈ సిరీస్ WTC 2025-27 సైకిల్లో భాగం కావడంతో, రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం భారత్‌కు అత్యవసరం. శ్రీలంక పిచ్‌లు సాధారణంగా స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా సహకరిస్తాయి. కాబట్టి, భారత బ్యాటర్లకు లంక స్పిన్నర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ గడ్డపై మెరుగైన ప్రదర్శన కనబర్చి, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు క్రికెట్ అభిమానులు ఈ సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి కింద పేర్కొన్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించవచ్చు. ఈ క్రికెట్ మ్యాచ్‌లను బుల్లితెరలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఓటీటీ ప్రేక్షకుల కోసం సోనీలివ్ యాప్ లేదా వెబ్సైట్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





