
Aug 19 2026 12:49 PM | Updated on Aug 19 2026 12:50 PM
గోరఖ్‌పూర్: బోగీలో తాను కూర్చునేందుకు కుర్చీ లేదనే నెపంతో రైలు గార్డు ఒక సూపర్‌ఫాస్ట్ రైలును ఏకంగా 38 నిమిషాల పాటు స్టేషన్లోనే నిలిచిపోయేనా చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి లలిత్‌గ్రామ్ వెళ్తున్న వైశాలి ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో ఈ వివాదం తలెత్తింది. రైలు గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న రామాశిష్ దాస్, తన కేబిన్‌లో కూర్చోవడానికి సరైన కుర్చీ సదుపాయం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
తనకు సరైన సీటు ఏర్పాటు చేసేంత వరకు రైలుకు పచ్చజెండా ఊపేది లేదని, ముందుకు తీసుకెళ్లబోనని ఆయన మొండికేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గార్డుతో చర్చలు జరిపారు. రైలు ప్రయాణ మార్గంలోని తదుపరి ముఖ్య స్టేషన్ అయిన డియోరియాలో కూర్చోవడానికి తగిన సీటింగ్ ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో గార్డు శాంతించి రైలు కదలడానికి అనుమతించారు. ఈ తతంగానికి 38 నిమిషాల సమయం పట్టడంతో వైశాలి ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటన రైల్వే వర్గాల్లో కలకలం రేపింది. ఇది కూడా చదవండి: విజయ్ ఓ వర్గానికే సీఎం?.. నిలదీసిన బీజేపీ
సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)
కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు)
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు)
ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మాధవరావు
అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత సంచలన పోస్ట్
తెలుగోళ్లకు అవార్డుల పంట.. జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్రం
10 లక్షల పెట్టుబడి..1.25 కోట్లు లాభం.. HDFC మ్యూచువల్ ఫండ్ అద్భుతం
నిధికి కేక్ పెట్టిన పర్సన్ ఎవరో తెలుసా..?
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Share this story
Help others stay updated with verified breaking news and insights.










