
Ajinkya Rahane : అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల అజింక్య రహానే వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను నాలుగు మ్యాచ్‌ల నిషేదం నుంచి కాపాడినట్లు వెల్లడించాడు. ఈ ఘటన 2022లో దులీప్ ట్రోఫీలో చోటు చేసుకున్నట్లుగా తెలిపాడు. దులీఫ్ ట్రోఫీ2022లో భాగంగా సౌత్ జోన్, వెస్ట్ జోన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వెస్ట్‌జోన్‌కు కెప్టెన్‌గా రహానే ఉండగా, జైస్వాల్ అతడి టీమ్‌లోనే ఉన్నాడు. ఆ సమయంలో కుర్రాడు అయిన జైస్వాల్ చాలా బాగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ బ్యాటర్ రవితేజను యశస్వి జైస్వాల్ పదే పదే స్లెడ్జింగ్ చేస్తూ అతడిని రెచ్చగొట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. Shakib Al Hasan : భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్.. అంపైర్లతో పాటు రహానే వెళ్లి పరిస్థితి చేయి దాటకుండా చూశారు. చివరకు అంపైర్లు.. రహానేకు పరిస్థితిని వివరించారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు రహానే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. జైస్వాల్‌ను మైదానం వీడాలని సూచించాడు. కెప్టెన్ చెప్పడంతో చేసేది ఏమీ లేక జైస్వాల్ అయిష్టంగానే మైదానాన్ని వీడాడు. నిషేదం పడి ఉంటే.. 'క్రికెట్లో స్లెడ్జింగ్ అనేది కామన్. అది జరగాలి కూడా. దాంతో ఆటలో కొంత సరదా ఉంటుంది. కానీ ఆ సమయంలో పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. అది అదుపు తప్పే అవకాశం ఉందని నాకు అనిపించింది. ఆ సమయంలో యశస్వికి బాధగా అనిపించి ఉండొచ్చు. కానీ తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో నేను ముందుగానే ఊహించాను. ఆటగాళ్లు కొన్ని సందర్భాల్లో నిషేధానికి గురైన పరిస్థితులను నేను చూశాను. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒక అవకాశం కోల్పోతే మళ్లీ అందుకోవడం చాలా కష్టం. మీ సమయం ముగిసిపోవచ్చు. నా సహచర ఆటగాడిని ఆపడం నా బాధ్యత. అందుకే నేను జోక్యం చేసుకున్నాను.' అని రహానే తెలిపాడు. Ajinkya Rahane sends Yashasvi Jaiswal off the field after consistently sledging the batsman... Good to see Jaiswal back in the field, after knowing his mistake, good from Captain Rahane.#rahane #Cricket #Trending — Ankit | AI , Tech & News (@Ankityadav_360) September 25, 2022 ఆ ఘటన తర్వాత మ్యాచ్ రిఫరీ వి.ఎన్. కుట్టి తనతో చెప్పిన విషయాన్ని కూడా రహానే వెల్లడించాడు. నేను అలా చేస్తానని మ్యాచ్ రిఫరీ ఊహించలేదు.' నేను యశస్విని మైదానం నుంచి బయటకు పంపుతానని వాళ్లు అనుకోలేదు. మ్యాచ్ రిఫరీ అప్పటికే నాలుగు మ్యాచ్‌ల నిషేధానికి సంబంధించిన లేఖను సిద్ధం చేశారు. ఆయన నా దగ్గరకు వచ్చి.. ఇదిగో బ్యాన్ లెటర్. కానీ మీరు చేసిన పని కారణంగా దీన్ని చింపేస్తున్నాను అని చెప్పి, నా ముందే ఆ లేఖను చింపేశారు .'అని రహానే చెప్పుకొచ్చాడు. Team India : టీమ్ఇండియాకు గాయాల టెన్షన్.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లకు.. మొత్తానికి జైస్వాల్ మీద నిషేదం పడలేదు. అందుకు తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. ఇప్పుడు అతడు భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఒకవేళ ఆ సమయంలో అతడిపై నిషేదం పడి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పడం కష్టమే. ఏదైన జరిగి ఉండవచ్చునని రహానే తెలిపాడు.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Share this story
Help others stay updated with verified breaking news and insights.










