
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Zee Media Q1 Results: ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి. క్వార్టర్ 1 ఫలితాల్లో జీ మీడియా అదరగొట్టింది. రూ.190.85 కోట్ల ఆదాయం పొందడం విశేషం. ఏఐ, డిజిటల్లో దూసుకెళ్తున్న భారత మీడియా దిగ్గజం జీ నెట్వర్క్ తదుపరి ప్రణాళికలు, లక్ష్యాలు ఏమిటో జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు. క్యూ1 ఫలితాలపై అతడు స్పందిస్తూ జీ మీడియా నెట్‌వర్క్‌కు సంబంధించి ప్రణాళికలను వెల్లడించారు.
సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే మీడియా సంస్థ స్థాయి నుంచి విభిన్న ఆదాయ మార్గాలు కలిగిన టెక్-మీడియా కంపెనీగా జీ మీడియా రూపాంతరం చెందుతోందని నెట్వర్క్ సీఈవో రక్తిమ్ దాస్ తెలిపారు. క్యూ1 ఆర్థిక ఫలితాల అనంతరం జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్‌రూమ్‌లు, రీజినల్ నెట్వర్క్ విస్తరణే తమ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (జెడ్ఎంసీఎల్) ఆర్థిక ఫలితాలు, సంస్థ డిజిటల్ వ్యూహం, భవిష్యత్ విస్తరణపై జీ ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆర్థిక పనితీరు – కీలక గణాంకాలు ఆదాయం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1) జీ మీడియా ఏకీకృత ఆదాయం రూ.190.85 ( రూ.1,908.5 మిలియన్లు) కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఖర్చులు: నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు రూ.174.59 కోట్లు (1,745.9 మిలియన్లు)గా ఉన్నాయి. వ్యూహాత్మక మైలురాయి: క్యూ1 పనితీరు సంస్థ తదుపరి వృద్ధి ప్రయాణానికి బలమైన పునాది వేసింది.
సరికొత్త ఆదాయం వైపు మార్పు సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే న్యూస్ కంపెనీ స్థాయి నుంచి బహుళ ఆదాయ మార్గాలు కలిగిన మీడియా సంస్థగా జీ మీడియాను తీర్చిదిద్దుతున్నట్లు సీఈఓ రక్తిమ్ దాస్ తెలిపారు. కంటెంట్ + టెక్నాలజీలో ప్రపంచ స్థాయి ఎడిటోరియల్ సామర్థ్యాలు, అత్యాధునిక సాంకేతికత, డేటా, కృత్రిమ మేధా (ఏఐ) కలయికతో జీ మీడియా పూర్తి సామర్థ్యాన్ని వెలికితీస్తున్నామని వివరించారు.
ప్రధాన బ్రాండ్లు, ఛానళ్ల విస్తరణ వ్యూహం జీ న్యూస్, జీ బిజినెస్: మార్కెట్ లీడర్షిప్ను మరింత పటిష్టం చేయడం. జీ భారత్: యువత, ఆకాంక్షలు కలిగిన కొత్త తరం భారతావనిని ఆకట్టుకునేలా సరికొత్త బ్రాండ్ ఐడెంటిటీతో ముందుకు తీసుకువెళ్లడం. వియాన్: అంతర్జాతీయ వేదికపై సంస్థ గ్లోబల్ విస్తరణ ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా వియాన్ నిలుస్తుంది. ఇటీవల శ్రీలంకలో నిర్వహించిన 'గ్లోబల్ లీడర్షిప్ & ఇన్నోవేషన్ సమ్మిట్' ద్వారా గ్లోబల్ భాగస్వామ్యాలపై చర్చలు జరిగాయి. ప్రాంతీయ నెట్వర్క్ బలోపేతం: అసోసియేటెడ్ ప్రాంతీయ మార్కెట్లలో 'లాంగ్వేజ్-ఫస్ట్' విధానంతో విస్తరణ.
డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఏఐ వినియోగం డిజిటల్ వృద్ధి: అధిక ప్రభావం చూపే.. స్కేల్ చేయగల ప్రత్యేక ప్రాపర్టీలపై డిజిటల్ వ్యాపారాన్ని కేంద్రీకరిస్తూ నాన్-ట్రెడిషనల్ మానిటైజేషన్ అవకాశాలను అన్‌లాక్ చేస్తున్నారు. యూట్యూబ్ దూకుడు: యూట్యూబ్ ఎకోసిస్టమ్‌లో జీ మీడియా వీడియో వ్యూస్ దాదాపు 3 రెట్లు పెరిగాయి. ఏఐ-పవర్డ్ న్యూస్‌రూమ్స్: వార్తా సేకరణ, కంటెంట్ వర్క్‌ఫ్లో వేగవంతం, డేటా ఆధారిత స్టోరీటెల్లింగ్ కోసం న్యూస్‌రూమ్‌లలో అత్యాధునిక ఏఐ టూల్స్‌ను అనుసంధానించారు.
ఎడిటోరియల్ బలం, పీపుల్-సెంట్రిక్ జర్నలిజం పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమగ్ర కవరేజీతో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల్లో క్షేత్రస్థాయి విశ్లేషణలతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. జీ న్యూస్ ప్రముఖ కార్యక్రమం 'డీఎన్ఏ' ద్వారా విద్యా ఫీజులు, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్‌కేర్, మందుల ధరలపై భారీ ప్రచారాలు నిర్వహించింది. ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, గ్రౌండ్ రిపోర్టింగ్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు సీఈవో తెలిపారు.
గ్రోత్ అవుట్‌లుక్, ఈవెంట్లు ప్రజారోగ్యం, పబ్లిక్ పాలసీ, టూరిజం, బిజినెస్, విద్య, సంస్కృతి తదితర రంగాల్లో నెట్వర్క్ వ్యాప్తంగా 36 హై-ఇంపాక్ట్ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించారు. జీ బిజినెస్ ద్వారా 'మనీ ఆల్ఫా', 'వెల్త్ సమ్మిట్', 'భరోసే కి చాయిస్' వంటి ప్రముఖ ఫైనాన్షియల్ ఈవెంట్ల ద్వారా ఇన్వెస్టర్లు, నిపుణులను ఒకే వేదికపైకి తెచ్చారు.
బలమైన ఎడిటోరియల్ విలువలు, ఏఐ, డేటా సాంకేతికతల జోడింపు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, వైవిధ్యభరిత మానిటైజేషన్ మోడల్‌తో జీ మీడియా భవిష్యత్ వృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతోందని సీఈఓ రక్తిమ్ దాస్ వెల్లడించారు.




