
Aug 13 2026 3:48 PM | Updated on Aug 13 2026 3:53 PM
విజయవాడ: అర్హలైన ఓటర్లకు అన్యాయం జరగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా వారి ఓటును కాపాడుకునే అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ లేఖ రాసింది.
‘మ్యాపింగ్ అవ్వని, మ్యాచ్ అవ్వని రికార్డ్ల పేరుతో జారిచేస్తున్న నోటీసుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. చాలా మంది ఓటర్లు చదువు కోసం ఉద్యోగాల కోసం వలస కార్మికులగా తరలివెళ్లారు. వారి విషయంలో వారి తల్లిదండ్రులు, రక్తసంబంధికుల పేరుతో వస్తే అనుమతించాలి. భౌతికంగా హాజరు కాలేక పోయిన వారికి, నిజమైన ఓటర్ల కు అన్యాయం జరగకుండా చూడండి.
బిఎల్ఓ లను భాగస్వాములు చేసి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. ఓట్లు ధ్రువీకరణ విషయంలో ప్రత్యేకంగా బీఎల్వోలకు ఆదేశాలు జారీ చేయాలి. మూడు అంశాల ప్రాతిపదికన ఎన్నికల కమిషన్ ఈ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం’ అని లేఖలో స్పష్టం చేసింది.
కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)
'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు)
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
ఇసుక వేస్తే రాలనంత జనం.. దద్దరిల్లిన కర్నూలు
కాన్వాయ్ పై టవల్ విసిరిన అభిమాని.. జగన్ ఏం చేశాడో చూడండి
జగన్ అన్న వస్తే చరిత్ర మారుతుంది! YS జగన్ పర్యటనలో వైరల్ ఫ్లెక్సీ
కొద్దిసేపట్లో జైలు వద్దకు చేరుకోనున్న వైఎస్ జగన్




