
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పూజా మహేశ్వరి (@the_denimgirl) అనే యువతి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది... పూజకు జామకాయలను ఇంటికి తీసుకువచ్చిన్న ఆ యువతి.. జామకాలను కడిగేందుకు నీటిలో వేసింది. అంతే అక్కడ ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
నీటిలో వేస్తే ఏం జరిగింది..? రెండు గంటల తర్వాత జామకాయలను అలాగే ఉంచి చూడడగా.. ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది.. నీటిలో నానబెట్టిన జామకాయ పై పొర నుంచి నెమ్మదిగా చిన్న చిన్న పురుగులు బయటికి రావడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ పురుగులు చూడడానికి చాలా చిన్నవిగా, తెలుపు రంగులో ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.. అయితే, ఈ పురుగులు చాలా చిన్నవిగా ఉండడం వల్ల కనిపించడం చాలా కష్టమైంది..
అయితే, ఏమి తెలియని వారు.. కేవలం నీటిలో అలా కడిగేసి తినేస్తే.. అంతే సంగతి.. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ నీటి ట్రిక్ (Water Trick) చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయ్యో.. ఇన్నాళ్లు ఇలాగే కడగకుండా ఎన్ని పురుగులను తినేశామో.. అంటూ కొందరు ఆందోళన పడుతూ కామెంట్లు పెడుతున్నారు.. మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. ముఖ్యంగా వర్షాకాలంలో జామకాయలకు దూరంగా ఉండటమే మంచిది.. అని సలహా ఇస్తున్నారు. వర్షాకాలంలో పండ్లు తినే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



.webp)
