
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ttd chairman br naidu big alert to Tirumala devotees: కలియుగ దైవం, తిరుమల శ్రీవారిని దర్శించుకొవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఒకవైపు సెలవులు, లాంగ్ వీకెండ్ కూడా కలిసి రావడంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్ లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో విపరీతమైన భక్తులు రద్దీతో టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో .. భక్తులు తిరుమల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తమ యాత్రను ముందుగా ప్లాన్ చేసుకొవాలన్నారు. దర్శన సమయంలో సంయమనం పాటిస్తూ, టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు. వీకెండ్ కావడంతో కంపార్ట్ మెంట్ లు అన్ని భక్తులతో నిండిపోయి, వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరాయన్నారు.
ప్రస్తుతం దర్శన టికెట్లు, టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోందని వెల్లడించారు. భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలుశ్రీవారి సేవకులతో టీటీడీ నిరంతరాయంగా అందిస్తోందన్నారు. కేవలం మూడు రోజుల్లో దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు వచ్చాయని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. దీంతో కాలుష్య నియంత్రణ అత్యంత అవసరమని టీటీడీ భావిస్తోందన్నారు.
Read more: Manasa Varanasi: హీరోయిన్‌తో సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు.. ఒకర్ని మరోకరు నెట్టుకుంటూ.. వీడియో వైరల్...
టీటీడీ దాతల సహకారంతో తిరుమలలో మరో 37 ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు సుమారు 25 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని దీని వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు భక్తులకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





