
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Telangana Government Hospitals: సనత్ నగర్ టిమ్స్… తెల్లటి సౌధం. 22.6 ఎకరాల విస్తీర్ణంలో 1082 పడకల సామర్థ్యంతో భారీ భవన సముదాయం. కంటి నిండా కనబడే దివ్యరూపం… అద్భుతమైన కట్టడం. మూడు బ్లాకులు, ఐదు అంతస్తులతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిర్మాణ దశలో ఉన్నపుడు ఏదో ప్రైవేటు కట్టడమనుకున్నారు. నిర్మాణపనులు పూర్తయిన తర్వాత.. గవర్నమెంటు ఆస్పత్రి ఇంత పెద్ద బిల్డింగ్ లో పెడుతున్నారని అందరూ ఆశ్చర్చపోయారు.
ఈ ఆస్పత్రి సముదాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా గత నెలలో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ హాస్పిటల్‌కు ప్రస్తుతం హాస్పిటల్‌కు చుట్టుపక్కల ప్రాంతాల వారు వస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నలుమూలల నుంచి తెలంగాణ నుంచి వచ్చే వాళ్లకు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి మాజీ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి పేరును పెట్టారు. ఆధునిక హంగులు అద్దుకున్న సర్కారు దవాఖానా.. అరుదైన రోగాలను నయం చేయడంలో ముందుంది. ప్రాణాంతకర పరిస్థితుల్లో వచ్చినవారికి పాణం నిలబెట్టే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఎలాంటి అనారోగ్య సమస్యతో వచ్చినా… పెద్దా స్పత్రిలో చూపించుకున్నాననే భావనతతో మానసిక సంతృప్తి అందించడమే కాదు.. అందుకు అవసరమైన వైద్యసేవలు అందించి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దుతుందనే విశ్వాసం ఇక్కడ డాక్టర్లు పేసెంట్స్కు కల్పించే పనిలో పడ్డారు.
కిడ్నీ, గుండె, లివర్ మార్పిడి టిమ్స్ ప్రత్యేకత.... అనారోగ్యంతో ఉన్నవారికి నయం చేయడం నాటి మాట...ఇపుడు శరీర అవయవాల్లో ఏదైనా పాడైతే... మార్పిడిచేసే సమర్థతను ఈ టిమ్స్ సొంతం చేసుకుంది. గుండె, కిడ్నీ, లివర్ మార్పిడి చేసి... ఇక్కడ మనిషికి సరికొత్త జీవితాన్ని అందించే సౌకర్యాలున్నాయి. ఈ సర్కారు ఆస్పత్రి పేదలపాలిట పెన్నిదిగా సేవలు అందిస్తుంది. మధ్య తరగతి కుటుంబీకులకు ఆరోగ్య ప్రధాయినిగా విరాజిల్లబోతోంది. పేదలకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ... ఆర్థికంగా ఉన్నత స్థాయి కుటుంబీకులకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందించి ఆర్థిక భారాన్ని తగ్గించబోతోంది.
1,082 పడకలు, 300 ఐసియు పడకలు, 15 ఆపరేషన్ థియేటర్లు.. తెలంగాణలోనే అత్యాధునిక వసతులతో సంపూర్ణ వైద్యసేవలు అందించే తొలి ఆస్పత్రిగా మర్రి చెన్నారెడ్డి టిమ్స్ అందుబాటులోకి వచ్చింది. టిమ్స్ తో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. 1,082 పడకలు, 300 ఐసియు పడకలు, 15 ప్రధాన ఆపరేషన్ థియేటర్లతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రిగా సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పోరేట్ స్థాయి సర్కారు ఆస్పత్రిలో నాలుగు షిఫ్టులు నడిచే విధంగా మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆస్పత్రి విధి విధానాల్లో మార్పులు చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ప్రాణపాయకర పరిస్థితుల్లో వచ్చే క్షతగాత్రులకు ప్రత్యేక విభాగాల్లో ట్రామా కేర్ కీలకంగా పనిచేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. అవయవాల మార్పిడిలోనూ చారిత్రక రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని టిమ్స్ డాక్టర్లు అంటున్నారు.
పేదలకు పూర్తిగా ఉచితంగా స్పెషాలిటీ వైద్యసేవలు.. రోజు రోజుకు పెరిగిపోతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా సర్కారు దవాఖానా సరికొత్త రూపును సంతరించుకుంది. స్థానికంగా ఉన్నవారికి, తెలంగాణ వాసులకు ఉచిత వైద్యసేవలు అందిస్తుంది. అంతేకాదు.. హెల్త్ టూరిజం డెవలప్ మెంట్ లో భాగంగా విదేశీ రోగులకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందిస్తారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సర్కార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ తరహాలోనూ ఇక్కడ 200 పడకల సామర్థ్యంతో పేయింగ్ విధానంతోనూ సేవలు అందిస్తారు. విదేశీ రోగులనుంచి వచ్చే ఆస్పత్రి వైద్య సేవల ఫీజుతోపాటు పేయింగ్ సర్వీసుతో వచ్చే రాబడిని ఆస్పత్రి నిర్వహణకు వినియోగిస్తారు.
టిమ్స్ ఆస్పత్రి ద్వారా 37 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తారు. ఇక్కడ అందించే చికిత్సతోపాటు కీలకమైన విభాగాల ద్వారా పరిశోధనలు చేస్తారు. గుండెకు సంబంధించి ప్రత్యేక పరిశోధన విభాగం కీలకం కాబోతోంది. దీనికోసం కార్డియో థొరాసిక్ సైన్సెస్ ఏర్పాటు చేశారు. మూత్ర పిండ సంబంధ వ్యాధులతో పెరిగిన రోగులను దృష్టిలో పెట్టుకుని టిమ్స్ ఆస్పత్రి యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ గా ఆధునిక యంత్ర సామగ్రితో విశిష్ట సేవలు అందించే విధంగా తీర్చి దిద్దారు.
24 గంటలూ అందుబాటులో డాక్టర్లు.. ప్రతిక్షణం కీలకమేనని 24 గంటలూ నిరంతరం డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉంటారు. 300లకు పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతో డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యసేవలు అందిస్తున్నారు. 16 ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక వైద్యపరికరాలు, రోబో చికిత్స, ఎంఆర్ఐ యూనిట్, సీటీ స్కాన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వ్యాధి నిర్థారణకు పరీక్ష కేంద్రాలు సమర్థ వంతంగా పనిచేసే విధంగా ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయి. ప్రాణపాయకర పరిస్థితుల్లో ఉన్న వారిని అనువైన చోటుకు తరలించి, వైద్య సేవలు అందించే విధంగా లిఫ్టులు, శాంపిళ్ల సేకరణ, తరలింపునకు ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఓవరాల్ గా వైద్యసేవల విస్తరణలో టిమ్స్ విప్లవాత్మక మార్పులకు కారణం కాబోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





