
© 2026 nimisham.in


Temper Vamsi : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష లో షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇచ్చారు.