
ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొంతకాలంగా తమిళనాడు సినీ, రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు త్రిష. (Trisha) సీఎంగా విజయ్‌ ( Vijay ) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పేరు మరింత ట్రెండ్‌ అయింది. ప్రతిపక్ష నాయకులు సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి త్రిష, విజయ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ప్రస్తుతం సీఎం విజయ్‌ యూకే పర్యటనలో ఉన్నారు. రేసింగ్‌ ఈవెంట్స్‌లో భాగంగా సినీ నటుడు అజిత్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు కలుసుకున్నారు. అనంతరం జరిగిన రేసింగ్‌ ఈవెంట్‌ను విజయ్‌ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా సడెన్‌గా త్రిష మధ్యలోకి వచ్చారు. దీంతో విజయ్‌ కాస్త ఇబ్బందిపడ్డారు. వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తిప్పుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






