
అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి, దాన్నెలా వాడాలో తెలుసుకుందాం రండి..
ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు ఒక చుక్క ఆముదాన్ని పెదవులకు రాసుకుంటే.. అది సహజసిద్ధమైన లిప్‌బామ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
కొంతమంది గోళ్లు కాస్త పెరగ్గానే విరిగిపోతుంటాయి. ఈ సమస్య ఉన్న వారు రోజూ పడుకునే ముందు ఆముదంతో గోళ్లను పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల గోళ్లు దృఢంగా మారి విరిగిపోకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. రోజూ ఆముదం రాసుకోవడం వల్ల గరుకుగా ఉన్న చర్మం కూడా మృదువుగా మారుతుందట.
రోజూ ఆముదం రాసుకోవడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. ఫలితంగా చర్మం తాజాగా కనిపిస్తుందట. చర్మం ముడతలు పడకుండా చేసే గుణాలూ ఆముదంలో బోలెడున్నాయి. అందుకే దీన్ని ‘యాంటీ ఏజింగ్’ చికిత్సల్లో కూడా ఉపయోగిస్తారంటున్నారు నిపుణులు.
కొంతమంది అమ్మాయిలకు కనుబొమ్మలు, రెప్పలు చాలా పలుచగా ఉంటాయి. ఇలాంటివారు రోజూ రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
అయితే ఆముదం సౌందర్య సంరక్షణకు ఉపయోగపడినా.. మితంగా వాడడం, వాడే ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
Powered By Margadarsi Computers
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings





