
భువనగిరి: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాసవి క్లబ్‌ భువనగిరి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. పట్టణంలోని కెనరా బ్యాంకు ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ ఛైర్మన్‌ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు పసుపు నూరి నాగభూషణం ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్‌ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అభినందించారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రజలు సహజసిద్ధమైన విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు. ప్రజలు ఉత్సవాలను శాంతియుతంగా అత్యంత వైభవంగా నిర్వహించుకొని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





