
బాసర: గుర్తింపు కార్డు లేకుండా లాడ్జి గదులను అద్దెకిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని సీఐలు రవీందర్ నాయక్, దీపక్‌ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఆదేశాల మేరకు ఆదివారం బాసరలోని లాడ్జీలు, దాబాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. లాడ్జిల్లో గుర్తింపు కార్డు లేకుండా ఎవరికి గదులు అద్దెకు ఇవ్వరాదని.. అద్దెకు తీసుకున్న వారి వివరాలు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






