
నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు.
POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి..
22ఏ/POB దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. భూ రెగ్యులరైజేషన్కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్లైన్లో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టేందుకే ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ పెడుతున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో ఉన్న వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
POB దరఖాస్తులను నేరుగా కలెక్టర్లకు పంపాలి..
POB దరఖాస్తులను ఇక తహసీల్దార్లకు కాకుండా నేరుగా కలెక్టర్లకు పంపాలని మంత్రి పొంగులేటి సూచించారు. POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దని ఆదేశించారు. తిరస్కరణకు కారణాలు తెలిపేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదని స్పష్టం చేశారు. అర్హులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు.
'హర్ ఘర్ తిరంగా' అభియాన్లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
Read Latest AP News And Telangana News And National News




