కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవిత ప్రయాణంపై రాబోతున్న ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)పై ఆమె కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. తన తల్లి జీవితంలో పడన కష్టాలు, జరిగిన విషాదాలు, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన తండ్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కలిసి ఉండడాన్ని తాను చివరిసారిగా 35 ఏళ్ల క్రితం చూశానని రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులను తాను, తన సోదరి ప్రియాంక గాంధీ మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు. తన తండ్రి చనిపోయిన రోజు నుంచి ఎదురైన ప్రతీ సవాలును సోనియా గాంధీ ఎంతో ధైర్యం, గౌరవంతో ఎదుర్కొన్నారు అని రాహుల్ గాంధీ తన పోస్టులో వ్యక్తం చేశారు. తల్లి జీవిత కథను ప్రపంచంతో పంచుకోవడానికి ఆమె ముందుకు రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.సోనియా గాంధీ జీవితకథపై రానున్న పుస్తకం ‘Belonging: A Journey of Love’ను ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. ఆమె కథను ప్రేమించే కోట్లాది మంది చదవబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. వ్యక్తిగత జీవితాన్ని బయటికి చెప్పడానికి ఇష్టపడని సోనియా గాంధీ.. తన కథను ప్రపంచానికి చెప్పేందుకు అంగీకరించడం అంత సులభమైన విషయం కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.తన తండ్రి రాజీవ్ గాంధీ.. ఈ రోజు ఉంటే తన తల్లిని చూసి గర్వపడేవారని రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. 'ఇవాళ ఆయన పుట్టినరోజు అని.. నాన్న తన అందమైన సోనియాను గర్వంగా చూస్తూ


