
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
School Holidays Tomorrow August 21 TO 28: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆగస్టు చివరి వారంలో విద్యార్థులకు పండగల కారణంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఆగస్టు 21, ఆగస్టు 25, ఆగస్టు 26, ఆగస్టు 28వ తేదీల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో సెలవులు ఒకే తేదీల్లో ఉండవు. ముఖ్యంగా మిలాద్ ఉన్న నబీ, ఓనం, రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం వంటి పండగల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ రాష్ట్రం, పాఠశాల అధికారిక సెలవు క్యాలెండర్ పరిశీలించడం చాలా ముఖ్యం.
ఆగస్టు 21వ తేదీ: ఆగస్టు 21వ తేదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవు ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ సెలవులు ప్రకటిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉత్తర్వులను జారీ చేశాయి. శ్రావణ మాసంలో నిర్వహించే ముఖ్యమైన పండగల్లో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని తెలిసిన సంగతే. ముఖ్యంగా మహిళలు ఈ రోజు వరలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పండగ ప్రాధాన్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది.
ఆగస్టు25వ తేదీన సెలవు: ఆగస్టు 25వ తేదీన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంది. అదే సమయంలో కేరళలో జరుపుకునే మొదటి పండగ ఓనం సందర్భంగా కూడా సెలవు ఉంది. అయితే అయితే ఈ సెలవు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా వర్తించదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన అధికారిక సెలవుల జాబితా ఆధారంగా స్కూల్స్ పనిచేస్తాయి.
ఆగస్టు 26వ తేదీ: ఆగస్టు 26న తిరువోణం సందర్భంగా కేరళ రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవు ఉంది. ఓనం పండగ కేరళలో అత్యంత ముఖ్యమైన పండగల్లో ఒకటి. దీంతో ఈ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది.
ఆగస్టు 28 రక్షాబంధన్ ఆగస్టు 28వ తేదీన రాఖీ పౌర్ణమి. ఈ సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. అదే తేదీన కొన్ని ప్రాంతాల్లో వరలక్ష్మీ వ్రతం కూడా జరుగుతుంది.
ఆగస్టు 25 నుంచి 28వ తేదీ వరకు వరుసగా సెలవులు? ఆగస్టు 25వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య పలు పండగలు రావడంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతాల్లో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించే ఛాన్స్ ఉంది. అయితే 25నుంచి 28వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వరుసగా 4 రోజులు సెలవులు ఉన్నాయనడం సరైంది కాదు.. పండగలు సందర్భంగా సెలవుల విషయంలో రాష్ట్రాల మధ్య తేడా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వైసరల్ అవుతున్న సెలవుల జాబితా మాత్రమే ఆధారం చేసుకోకూడదు. మీ పాఠశాల అధికారిక నోటీస్ లేదా సంబంధిత రాష్ట్ర విద్యాశాఖ క్యాలెండర్ ను పరిశీలించడం ముఖ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





