

Rohit Naidu Patnam : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్, ఏడవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది.
తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వగా పదవ కంటెస్టెంట్ గా సృష్టి ఎంట్రీ ఇచ్చింది. పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. మహాదేవుని చరణ్ తేజ పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. పదమూడవ కంటెస్టెంట్ గా నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇక పద్నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. పదిహేనవ కంటెస్టెంట్ ని అగ్నిపరీక్ష ఫైనల్ లో నిలిచిన వారిలో ఆడియన్స్ ఓట్స్ ద్వారా రోహిత్ ని ఫైనల్ చేసారు. బిందు మాధవి అతన్ని స్టేజిపైకి తీసుకొచ్చింది.
Also Read : Varshini sounderajan : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పధ్నాలుగవ కంటెస్టెంట్.. యాంకర్ వర్షిణి..
రోహిత్ ఒక కామన్ మ్యాన్ గా అగ్నిపరీక్షలో ఫైనల్ కి సెలెక్ట్ అయి ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే రోహిత్ కి రాగానే పెద్ద టాస్క్ ఇచ్చారు నాగార్జున. అగ్నిపరీక్ష నుంచి తీసుకొచ్చిన గ్లాస్ లో వాటర్ తీసుకెళ్లి హౌస్ లో ఎవరో ఒకరి మొహం మీద పోయమన్నారు.
Senior Editorial Lead • Skyc Media Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media. Help others stay updated with verified breaking news and insights.
Written by Skyc Media Editorial
checkShare this story
Recommended for you





