
తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజూ 15 వేల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలను చెక్‌ పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం తితిదే దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవం అని, తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోలేదని తితిదే వెల్లడించింది. సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని తితిదే విజ్ఞప్తి చేసింది. ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారాన్నిఅధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తుందని తితిదే పేర్కొంది. వాస్తవాలను నిర్ధరించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదని తెలిపింది. తితిదే పేరిట తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





