
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
PM Kisan Money Update: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 23వ విడత నిధులు జూన్ నెలలో విడుదలైన నేపథ్యంలో, రైతులు ఇప్పుడు 24వ విడత కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ముందుగా కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన బెనిఫిషియరీ స్టేటస్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే, ముందుగా e-KYC పూర్తి చేయాలి. అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌లో గ్రామ స్థాయి వారీగా జాబితా అందుబాటులో ఉంటుంది.
మీరు అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేసి, హోమ్ పేజీలో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' సెక్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ 'బెనిఫిషియరీ స్టేటస్' లేదా 'బెనిఫిషియరీ లిస్ట్' ఆప్షన్‌ను ఎంచుకుని, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ స్టేటస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
e-KYC పూర్తి చేయని వారు తదుపరి విడత నిధులను పొందలేరు. కాబట్టి అధికారిక వెబ్సైట్లో pmkisan.gov.in బయోమెట్రిక్ ఆధారంగా e-KYC అప్డేట్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఉన్న e-KYC ఆప్షన్‌ను ఎంచుకుని, ఆధార్ వివరాలను నమోదు చేస్తే వచ్చే OTP ద్వారా ఆధార్‌ను సబ్మిట్ చేయాలి.
ఒకవేళ ఈ KYC ప్రక్రియలో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయించుకోవచ్చు. e-KYC పూర్తి చేయకపోవడం వల్ల కొంతమంది రైతులకు నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు ఆధార్ బ్యాంక్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ కూడా తప్పనిసరిగా చేయాలి. ఇందుకోసం మీ బ్యాంకుకు వెళ్లి ఆధార్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయించండి. తద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే నిధులు అందుతాయి. మీ ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోండి, ఎందుకంటే వెరిఫికేషన్ పూర్తి కాకపోతే డబ్బులు జమ కావు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి యోజనను ప్రారంభించింది, దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో కలిపి రూ.6000 జమ అవుతాయి. తదుపరి 24వ విడతగా అక్టోబర్ నెలలో రూ.2000 జమ అయ్యే అవకాశం ఉంది.. కాబట్టి ఈ నేపథ్యంలో ముందుగానే కేవైసీ పనులను పూర్తి చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





