
కేరళలోని ‘భూలోక వైకుంఠం’గా పిలిచే గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ‘నిర్మాల్య దర్శనం’ అత్యంత పవిత్రమైనది. వేకువజామున 3 గంటలకు స్వామివారికి లభించే ఈ తొలి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం వేకువజామున ఈ పవిత్ర నిర్మాల్య దర్శన సేవలో పాల్గొని బాలకృష్ణుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేరళ ఆలయ సంప్రదాయాల ప్రకారం సాష్టాంగ నమస్కారం చేసిన పవన్.. పరివార దేవతలకు, త్రిప్రయార్ శ్రీ రామస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వీడియోలో గురువాయూర్ క్షేత్ర మహత్యం, పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన విశేషాలు చూడవచ్చు.


