
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Orphaned calf drinks female dog milk video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు భావొద్వేగంను కల్గిస్తాయి. సమాజంలో ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అసలు మానవత్వం ఉందా ?..అని అందరు షాక్ అవుతున్నారు. ఒకర్ని మరోకరు చంపుకొవడం, వావి వరసలుమర్చిపోయి దారుణాలు చేసుకొవడం , ఆస్తుల కోసం ఎంతకైన తెగించడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. కొన్నిసార్లు మూగ జీవాలు చాలా వింతగా ప్రవర్తిస్తాయి.
అవి తమ జాతీవైరాన్ని కూడా మర్చిపోయిన సాటి జీవికి సాయం చేస్తాయి. ఇప్పటికే కోతులు, శునకాలు, పిల్లులు, మొదలైన వాటికి చెందిన అనేక వీడియోల్ని మనంచూశాడు. అవి ఆపదలో ఉన్నాయంటే మరో జీవి కోసం వచ్చిన ఘటనలు కొకొల్లలు. తాజాగా.. ఒక ఆవుదూడకు శునకం ఇచ్చి తల్లిగా మారింది.
ఈ సృష్టిలో తల్లికి ఎవరు సాటిరారని చెప్తారు. అది మనుషులకైన లేదా నోరులేనీ ప్రాణుల కైన ఒకేలా ఉంటుంది. కానీ ఇటీవల కొంత మంది మనుషులు తమ పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. నవమాసాలుమోశామని కూడా ఆలోచించడంలేదు. అనేక రకాలుగా తమ క్రూరత్వంను బైటపెడుతున్నారు. చంపేందుకు సైతం వెనుకాడటంలేదు. మరోవైపు పిల్లలు కూడా అలానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక వీధి శునకం , ఆవు దూడకు తల్లిగా మారింది.
ఆవు దూడ మరీ తల్లి నుంచి విడిపోయిందో లేదా ఏమి జరిగిందో తెలీదు కానీ ఒక వీధి శునకం వద్దరకు వెళ్లింది. అది దాని పాలను తాగింది. శునకం కూడా ఆవు దూడ పాలు తాగుతుంటే ఏ మాత్రం కదలించకుండా అక్కడ ఉండిపోయింది. పాలుతాగుతున్నంత సేపు తన కడుపులోని బిడ్డ పాలు తాగినట్లు కదలకుండా ఉండిపోయింది.తన బిడ్డలానే భావించింది.
Read more: Jogulamba Gadwal: నువ్వు తోపు సామి.. వర్షాలు కురవాలని భారీ మొసలికి పూజలు.. వీడియో వైరల్...
పాపం.. ఆవుదూడ కూడా ఎంత ఆకలితో ఉందో చాలా సేపు శునకం పాలు తాగింది. ఈ అరుదైన ఘటనను కొంత మంది వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మంది ఈ రోజుల్లో పక్కవాడ్ని ఎలా గెలకాలో అంటూ గోతికాడ నక్కల్లా కాచుకుని ఉండే కొంత మంది మనుషుల కన్నా.. నోరులేనీ జీవాలే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




