
Aug 15 2026 12:52 PM | Updated on Aug 15 2026 12:52 PM
సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శ్రీమతి శోభా రెడ్డి, శ్రీ ప్రసాద్ రెడ్డి దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ చిన్నారులు, పేద కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న వంటశాలకు 2.5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఐదు ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పది కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు.
ఆరోగ్య సేవల్లోనూ వారి సహకారం విశేషం. చెన్నైలోని శంకర నేత్రాలయ కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. దీంతో ఈ యూనిట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్యం, శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఎనిమిది నేత్ర శిబిరాలు నిర్వహించగా, తదుపరి శిబిరాన్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీ ప్రసాద్ రెడ్డి గారు శంకర నేత్రాలయ యూఎస్ఏకు బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నారు. అలాగే, తన సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని ప్రతి ఏడాది డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీ సెనెట్, అసెంబ్లీ ఆయనను సత్కరించాయి. శంకర నేత్రాలయం ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారంతోనూ ఆయనను గౌరవించనుంది.
శ్రీ ప్రసాద్ రెడ్డి గారి సేవా ప్రస్థానంలో శ్రీమతి శోభా రెడ్డి గారి ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తున్నాయి. చిన్నారుల సంక్షేమం, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దంపతులు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
విలన్ నుంచి రియల్ స్టార్‌గా.. శ్రీహరి అరుదైన (ఫోటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం రద్దీ (ఫొటోలు)
'సురక్ష కా తిరంగా' అవగాహన కార్యక్రమంలో హీరో నాగార్జున (ఫొటోలు)
జెన్‌జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు)
ఆంక్షల మధ్య జగన్ పర్యటన.. పొలాల్లోంచి కూడా తరలివచ్చిన జనం
స్వాతంత్య్ర వేడుకల్లో షాక్.. స్టేజ్ పైనే కుప్పకూలిన మంత్రి ఆనం
అనంతపురంలో హైటెన్షన్.. 15 గంటల పాటు హైడ్రామా.. లాయర్ గౌతంరాజుకి సీఐ క్షమాపణ
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ





