

Nihar Mukesh Gowda : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్, ఏడవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది.
తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వగా పదవ కంటెస్టెంట్ గా సృష్టి ఎంట్రీ ఇచ్చింది. పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. మహాదేవుని చరణ్ తేజ పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. పదమూడవ కంటెస్టెంట్ గా నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇక పద్నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. పదిహేనవ కంటెస్టెంట్ గా రోహిత్ వచ్చాడు. చివరగా పదహారవ కంటెస్టెంట్ గా కన్నడ నటుడు నిహార్ ముకేశ్ గౌడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : Rohit Naidu Patnam : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదిహేనవ కంటెస్టెంట్.. అగ్నిపరీక్ష రోహిత్..
నిహార్ ముకేశ్ కర్నటకకు చెందిన నటుడు. కన్నడలో జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు. తెలుగులో గుప్పెడంత మనసుతో పాటు పలు సీరియల్స్ లో నటించాడు. కన్నడలో హీరోగా కూడా నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Senior Editorial Lead • Skyc Media Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media. Help others stay updated with verified breaking news and insights.
Written by Skyc Media Editorial
checkShare this story
Recommended for you





