
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
NHAI Recruitment 2026: భారత జాతీయ రహదారి అథారిటీ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, నేషనల్ లా స్కూల్ లేదా ఇతర సంస్థల నుండి లా పట్టా పొందిన వారై ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) 2026 స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పోస్టులకు ఎంపిక చేస్తారు.
NHAI రిక్రూట్మెంట్ 2026 ఖాళీలు.. NHAI మొత్తం ఐదు ఖాళీలను ప్రకటించింది. ఇందులో యంగ్ ప్రొఫెషనల్ లీగల్ పోస్టులు ఉన్నాయి. వీటిలో నాలుగు పోస్టులు రిజర్వేషన్ లేని కేటగిరీకి, ఒకటి వెనుకబడిన తరగతుల (BC) వారికి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందులో ప్రత్యేక పోస్టులు లేవు.. అయితే ఈ ఐదు పోస్టులలో ఒక పోస్టును PWBD అభ్యర్థుల కోసం రిజర్వ్ చేస్తారు. ప్రకటించిన పోస్టుల సంఖ్య భవిష్యత్తులో పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందని NHAI పేర్కొంది.
అర్హతలు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లు మించకూడదు. గుర్తింపు పొందిన లా స్కూల్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా పట్టా, PG 2026 స్కోర్ కార్డు కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు.. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ. 60 వేల జీతం లభిస్తుంది. ఈ రెమ్యూనరేషన్ ప్రతి ఏడాది ఐదు శాతం పెరుగుతుంది. యంగ్ ప్రొఫెషనల్ లీగల్ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. NHAI అవసరాలను బట్టి ,అభ్యర్థుల పనితీరును బట్టి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తారు. ఇది మూడేళ్లకు మించదు.
NHAIలో దరఖాస్తు చేసుకునే విధానం.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో 'About' విభాగంలో 'రిక్రూట్మెంట్' ఆప్షన్‌ను ఎంచుకుని, అందులోని వేకెన్సీస్ విభాగంలో ప్రస్తుత సెక్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ 'అడ్వర్టైజ్మెంట్ ఫర్ యంగ్ ప్రొఫెషనల్ లీగల్' అనే అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం కావాల్సిన డాక్యుమెంట్లను నమోదు చేసి, అప్లోడ్ చేసి, చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక యూనిక్ రెఫరెన్స్ నంబర్ జారీ చేస్తారు. గడువు ముగిసేలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ హైవే సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





