
తిరుపతి (Tirupati) పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో కళ్లు తిరిగి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు (Doctor) మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్య్ర వేడుకల్లో (Independence Day celebrations) పాల్గొన్నారు.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media




