
మహబూబ్‌నగర్ (ఈటీవీ): రూ.2 వేల కోట్లతో మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించి విడతల వారీగా పనులు ప్రారంభిస్తున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.603 కోట్లతో ఏర్పాటు చేయనున్న భూగర్భ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మొదటి విడతలో రూ. 142 కోట్లతో 9 డివిజన్లలో మంజూరైన పనులను ఆయన ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే తాగునీటి వ్యవస్థకు రూ.200 కోట్ల వ్యయంతో ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపడుతున్నామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



.webp)
