
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Hydraa ranganath reacts on gachibowli 7 stairs incident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలీపోయిన ఘటనల తీవ్ర విషాదంగా మారింది. మాదాపూర్ సర్కిల్ లోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీని శిథిలాల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకుని చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బిల్డింగ్ కుప్పకూలీనప్పుడు అది కాస్త పక్కన ఉన్న మరో బిల్డింగ్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్అయ్యింది.
పెద్ద శబ్దంతో బిల్డింగ్ కూలడంతో చుట్టుపక్కల వారు ఇళ్ల నుంచి భయంతో బైటకు పరుగులు పెట్టారు. వెంటనే హైడ్రా, డీఆర్ఎఫ్,మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మోపత్, ఉమేష్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సాజిద్ అనే బిల్డర్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా అక్కడ అనేక ప్రాంతంలో ఈవిధమైన నిర్మాణాలు ఉన్నాయనిస్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్ దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా.. అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఉపేక్షించబోమన్నారు.
ఘటనాస్థలి పక్కన భవనాల వారు ఖాళీ చేసి ఇతర చోట్లకు వెళ్లాలని రంగనాథ్ ఆదేశించారు. బిల్డింగ్ యజమాని ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్‌కి కొంతమంది ఫిర్యాదు చేశారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం నోటీసులు జారీ చేశారన్నారు. గతంలో హైడ్రాకు ఈ బిల్డింగ్ నిర్మాణంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఏడు అంతస్తులు, ఒక పెంట్ హౌస్ మొత్తం ఎనిమిది అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారని వివరించారు.
నాలాను అతిక్రమించి ఈ బిల్డింగ్ నిర్మాణం చేశారన్నారు. ఇక్కడి చుట్టుపక్కల బిల్డింగ్ లను సైతం పరిశీలించి నిబంధనకు విరుద్దంగా ఉంటే కూల్చివేస్తామని రంగనాథ్ తెల్చి చెప్పారు. శిథిలాల కింద ఎవరైన చిక్కుకున్నారా..?.. అన్న కోణంలో విచారణ చేపట్టామన్నారు.
నాలుగు నెలల క్రితమే ఆ బిల్డింగ్ సీజ్ : కమిషనర్ సృజన
ఏడంతస్తుల భవనం ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన మాట్లాడారు. గతంలోనే ఈ నిర్మాణాలపై తమకు ఫిర్యాదులు వచ్చాయని, నాలుగు నెలల క్రితమే ఈ నిర్మాణ పనులను ఆపేసి, సీజ్ చేశామని తెలిపారు.
Read more: Hyderabad: హైదరాబాద్‌లో మరో ఘోరం.. గుడిలోని దుర్గమ్మతల్లి విగ్రహంను మాయం చేసిన దుండగులు..!
దీనిపై నిన్న పనులు మరల స్టార్ట్ చేశారని తమకు తెలిసిందని, నోటీసులు ఇద్దామనుకునేలోపు ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. హాస్టల్ బిల్డింగ్ కోసం ఈ నిర్మాణాన్ని చేపట్లినట్లు కమిషనర్ సృజన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




