
సింహాచలం: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం హోం మంత్రి అనిత.. అప్పన్న స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం పండితులు హోంమంత్రి అనితకు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అప్పన్న స్వామి సన్నిధిలోని శివాలయంలో కూడా హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






