
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Giant Cobra Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో జంతువులతో పాటు ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. పాము పేరు చెప్తేనే ఆమడ దూరం పరుగెత్తే జనాలు.. అదే పాము వీడియోలను ఇప్పుడు కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ భారీ నాగుపాముకు సంబంధించిన వీడియో ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ (Akbar Aziz Snake Catcher) అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఒక షార్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తోంది.. ఇండియన్ కోబ్రా ఏదో తినేసి భారీ పొట్టతో అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. వీడియో ప్రారంభంలోనే ఒక భారీ నాగుపాము నోరు తెరిచి.. అటు ఇటు కదులుతూ ఉండడం మీరు గమనించవచ్చు.. అంతేకాకుండా ఆ పాముకు ఉన్న భయంకరమైన కళ్లు చూస్తే.. ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే.. అయితే, ఈ పాము అమాంతం మింగిన ఎరను బయటకు కక్కుతున్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.
అయితే, ఈ వీడియోకు ఇంతటి క్రేజ్ రావడానికి మరో ప్రధాన కారణం ఇందులోని పాము తిన్న ఎరను బయటకు దాని నోటి ద్వారా బయటకు కక్కేయడం.. సాధారణంగా పెద్ద పెద్ద పామును జంతువులను ఎంతో సులభంగా తింటూ ఉంటాయి. అంతేకాకుండా వాటికి అది సులభంగా జీర్ణం అవుతూ కూడా ఉంటుంది. కానీ కొన్ని పాము వాటి శరీరానికి మించిన ఆహారాలు తీసుకోవడం కారణంగా అవి తిన్న ఎరను బయటికి కక్కుతూ ఉంటాయి. ఈ వీడియోలో కూడా ఇదే ఘటన జరగడం మీరు చూడొచ్చు..
ఈ వీడియోలో మీరు పామును చూస్తుండగానే అది అటు ఇటు కదులుతూ.. అది మింగిన పెద్ద కప్పను బయటికి కక్కేయడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ పాము చాలా నెమ్మది నెమ్మది కడుపులో ఉన్న కప్పను నోటి సహాయంతో బయిటికి కక్కడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యాలను చూసిన చాలా మంది ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు.
పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ షార్ట్ వీడియోకు లక్షలాది వ్యూస్, వేలాది లైక్స్ వచ్చాయి. కామెంట్స్ సెక్షన్లో నెటిజన్లు తమదైన శైలిలో ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. పామును చూస్తుంటేనే భయమేస్తోంది.. దానికి తోడు ఆ పాము మింగిన కప్పను బయటకు కక్కడం చూస్తే.. గూస్బంప్స్ వస్తున్నాయని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



