PF Withdrawal via UPI : ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సామాజిక భద్రతా పథకం. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి 12 శాతం ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో జమవుతుంది. ఇంకా కంపెనీ కూడా తన 12 శాతంలో 8 శాతానికిపైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలో (EPS) వేస్తుంది. మరో 3 శాతానికిపైగా ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిగా మారుతుంది. అయితే పీఎఫ్ డబ్బుల్ని నిర్వహించడం, ఉద్యోగం మారినప్పుడు పాత ఖాతాలోని మొత్తాన్ని కొత్త ఖాతాకు బదిలీ చేయడం, అవసరమైనప్పుడు క్లెయిమ్ చేసుకోవడం వంటి ప్రక్రియల్లో గతంలో కొంత ఇబ్బంది ఉండేది.అయితే ఇటీవలి ఈ సమస్యలపై ఈపీఎఫ్ఓ ప్రధానంగా దృష్టి సారించి సేవల్ని మెరుగుపరిచింది. సేవల్ని మరింత డిజిటల్‌గా, వేగంగా అందించే దిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక మార్పులు తీసుకొచ్చింది. 2026లో ఉద్యోగులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఈ కీలక మార్పుల గురించి చూద్దాం.ఉమంగ్ యాప్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్- యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఉద్యోగి ఉద్యోగం మారినా ఈ నంబర్ మారదు. ప్రస్తుతం కొత్త యూఏఎన్‌ను జనరేట్ చేయడం, ఇప్పటికే ఉన్న యూఏఎన్‌ను యాక్టివేట్ చేయడం కోసం ఈపీఎఫ్ఓ సభ్యులు ఉమంగ్ యాప్‌లో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. దీంతో ఉద్యోగులు యూఏఎన్‌కు సంబంధించిన పనుల కోసం గతంలో ఉన్న కొన్ని అదనపు దశల్ని తగ్గించుకోవచ్చు. Read Also: 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే ఎంత పెన్షన్ వస్తుంది? కొత్త లెక్కలు, ఫార్ములా ఇదే..ఉద్యోగం మారితే పీఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్- ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాలోని డబ్బును కొత్త ఖాతాకు బదిలీ చేయడం ఉద్యోగులకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆధార్‌తో అనుసంధానమైన, కేవైసీ పూర్తయిన యూఏఎన్ ఉన్న ఉద్యోగులకు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సదుపాయం అందుబాటులో ఉంది. దీంతో ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత వేగంగా- పీఎఫ్ డబ్బులు అవసరమైనప్పుడు క్లెయిమ్ చేసిన తర్వాత ఎంత కాలం పడుతుందన్నది ఉద్యోగులకు చాలా ముఖ్యం. ఈపీఎఫ్ఓ ఇప్పటికే కొన్ని అడ్వాన్స్ క్లెయిమ్స్‌ను ఆటో సెటిల్మెంట్ విధానంలో ప్రాసెస్ చేస్తోంది. 2026లో ఈ ఆటోమేషన్‌ను మరింత విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ కేవైసీ, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్, క్లెయిమ్ సంబంధిత సమాచారం సరిగ్గా ఉండటం అవసరం.Read Also: ఈపీఎఫ్‌లో రూ. 9330 కోట్లు.. ఈ డబ్బంతా ఎవరిది? చెక్ చేసుకోండి.. క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..పీఎఫ్ డబ్బులు ఖాతాలోకి త్వరగా వచ్చే అవకాశం- క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడంపై ఈపీఎఫ్ఓ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అవసరమైన వివరాలు సరిగ్గా ఉన్న క్లెయిమ్స్‌ను వేగంగా పరిశీలించి సెటిల్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు అవసరమైన ఉద్యోగులకు ప్రయోజనం కలిగించొచ్చు. ఇక్కడ కూడా వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. భవిష్యత్తులో యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా- పీఎఫ్ సేవల్లో మరో ఆసక్తికరమైన అంశం యూపీఐ ఆధారిత క్లెయిమ్ సెటిల్మెంట్. ఈపీఎఫ్ఓలో యూపీఐ వ్యవస్థను ఉపయోగించి పీఎఫ్ క్లెయిమ్ మొత్తాన్ని సభ్యుడి యూపీఐ లింక్డ్ బ్యాంక్ ఖాతాలోకి వేగంగా జమ చేసిన విధానంపై పని జరుగుతోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాంకేతిక అభివృద్ధి, పరీక్షలు వంటి ఇతర ప్రక్రియలు అవసరం. దశల వారీగా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.





