
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
School girl dies in delhi after teacher stand in sun punishment: సాధారణంగా సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంతో గౌరవంగా చూస్తారు. టీచర్లు తమ పిల్లలకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా చెబుతారని తల్లిదండ్రులు వారిపైన ఎంతో నమ్మకాలు పెట్టుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఉపాధ్యాయుల ప్రవర్తన వారి పవిత్రమైన వృత్తికే మాయనిమచ్చగా మారుతుంది. కొంత మంది తప్పతాగి క్లాసులకు రావడం, తోటి మహిళ సిబ్బంది పట్ల నీచంగా ప్రవర్తించడం, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారి పనులు చేయించుకొవడం చేస్తున్నారు.
మరికొంత మంది మాత్రం స్టూడెంట్స్ పట్ల పైశాచీకంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్‌లోని సర్వోదయ కన్యా విద్యాలయం ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల పదేళ్ల బాలిక స్కూల్ లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి పడిపోయినట్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. అయితే.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా గంటల వ్యవధిలోనే చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర దుమారం రాజుకుంది. దీనిపై అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదేళ్ల విద్యార్థిని స్కూల్ కు పుస్తకం తెలేదని విషయంలో టీచర్ ఆమెను ఆగస్టు 27న రోజంతా ఎండలో నిలబెట్టింది. దీంతో బాలిక ఆరోగ్యం క్షీణించింది. తర్వాత పాఠశాల వారు బాలిక తల్లి అంజలికి ఫోన్ చేశారు.
తమ కూతురు స్కూల్ కు వెళ్లే వరకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆతర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే.. ఎండ వల్ల శరరీం డీహైడ్రేషన్, దాహనికి తాళలేక చనిపోయినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక కుటుంబం ఫిర్యాదు మేరకు పాఠశాల ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టారు.
వెంటనే ఉపాధ్యాయురాలిని పాఠశాల నుంచి బదిలీ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం, బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల బయట నిరసన చేపట్టారు.
Read more: School Holidays:స్కూల్ పిల్లలకు ఏకంగా ఆరు రోజులు సెలవులు ఖరారు..!
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి, విచారణ జరిపి, దోషులుగా తేలిన పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





