CGHS: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) పరిధిలోని లబ్ధిదారులైన ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై క్లారిటీ ఇవ్వాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవలే కోరింది. యూపీఎస్సీ అభ్యర్థన మేరకు సీజీహెచ్ఎస్ వివిధ అంశాలు కన్సల్టేషన్, పరీక్షలు, పరిశోధనలు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్స్, వ్యాధుల నిర్ధారణ, కంటి కన్సల్టేషన్ ఫీ వంటి వాటిపై క్లారిటీ ఇచ్చింది. అలాగే డిపార్ట్మెంట్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిన చికిత్సలకు సంబంధించిన విషయంపైనా స్పష్టతనిచ్చింది. ప్రతి ఉద్యోగి, పెన్షనర్ ఈ అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు పారదర్శక ఆరోగ్య సేవలు అందించే సీజీహెచ్ఎస్ (Central Government Health Scheme) మెడికల్ క్లెయిమ్‌లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలకమైన స్పష్టతనిచ్చింది. వైద్య బిల్లుల పునరుద్ధరణ సమయంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, క్లెయిమ్‌ల తిరస్కరణలను నివారించేందుకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. యూపీఎస్సీ లేవనెత్తి పలు సందేహాలకు స్పందిస్తూ, వైద్య పరీక్షలు, డాక్టర్ సంప్రదింపులు, నెట్వర్క్ ఆసుపత్రుల ఉపయోగంపై పలు నిబంధనలను సీజీహెచ్ఎస్ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 11, 2026 రోజున యూపీఎస్సీ ఆఫీస్ మెమోరండం జారీ చేసింది.Read Also: CGHS: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం.. కొత్త ఛార్జీలు ఇవే.. ఎలా అప్లై చేసుకోవాలంటే?ఫాలో-అప్ చికిత్సఒక లబ్ధిదారుడు సీజీహెచ్ఎస్ గుర్తింపు పొందిన ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక సంప్రదింపులు పూర్తి చేసుకుంటే డాక్టర్ సూచించే తదుపరి పరీక్షలు, శస్త్రచికిత్సలు లేదా ఫాలో-అప్ కన్సల్టేషన్ తప్పనిసరిగా అదే ఆసుపత్రిలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.రూ.3000లోపు పరీక్షలకు అనుమతులుస్పెషలిస్ట్ డాక్టర్ సూచించిన సాధారణ వైద్య పరీక్షల విలువ రూ.3000 దాటకపోతే, ప్రాథమిక వైద్యం పొందిన ఆసుపత్రిలోనే పరీక్షలు చేయడానికి సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ నుంచి ప్రత్యేక రిఫరల్ లెటర్ అవసరం లేదు.వేరే ఆసుపత్రులకు మారడంప్రాథమిక చికిత్స ఒక ఆసుపత్రిలో పొంది, వైద్య పరీక్షలు మాత్రం వేరొక సీజీహెచ్ఎస్ నెట్వర్క్ డయాగ్నోస్టిక్ సెంటర్ లేదా హాస్పిటల్లో చేయించుకోవాలనుకుంటే, ఖర్చుతో సంబంధం లేకుండా సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ నుంచి ముందస్తు ఆమోదం పొందడం తప్పనిసరి.రూ.3000 దాటే పరీక్షలుసిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, పీఈటీ స్కాన్ లాంటి రూ.3000 కంటే ఎక్కువ విలువైన అడ్వాన్స్డ్ మెడికల్ పరీక్షలు చేయించుకోవాలంటే సీజీహెచ్ఎస్ నుంచి స్పష్టమైన అనుమతి ఉండాల్సిందే.డాక్టర్ కన్సల్టేషన్ చెల్లుబాటు కాలంసీజీహెచ్ఎస్ గుర్తింపు పొందిన స్పెషలిస్ట్ డాక్టర్ అందించే కన్సల్టేషన్ చీటీ, సదరు స్పెషాలిటీ కేటగిరీ పరిధిలో 7 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.కంటి పరీక్షలుకంటి పరీక్షల రుసుము పరిధిలో ప్రధానంగా మూడు వైద్య పరీక్షలు ఉంటాయి. రిఫ్రాక్షన్, టోనోమెట్రీ, ఫండస్ ఎగ్జామినేషన్ వంటివి చేస్తారు.లిస్టులో లేని చికిత్సలుసీజీహెచ్ఎస్ ఆమోదిత జాబితాలో లేని నూతన వైద్య పరీక్షలకు వైద్యులు సిఫార్సు చేస్తే, సంబంధిత శాఖాధికారుల నుంచి ముందస్తు ప్రత్యేక అనుమతి పొందిన తర్వాతే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.





