
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ktr fires on brs and bjp govt in independence day speech: దేశ వ్యాప్తంగా 80 వ ఇండిపెండెన్స్ డే సంబరాలు అంబరాన్ని తాకాయి. ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మువ్వన్నెల జాతీయ పతాకం రెపరెపలాడింది. ప్రజలంతా జాతీయజెండాను ఎగుర వేసి తమ దేశం పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హమీలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంను మరోసారి కేటీఆర్ నిలదీశారు. ఇండిపెండెన్స్ వేళ కూడా కాంగ్రెస్, బీజేపీలపై ఘాటైన విమర్శలతో కేటీఆర్ చుక్కలు చూపించారు.
సీఎం రేవంత్ తరచుగా 18 గంటలు పని చేస్తున్నట్లు చెప్తున్న డైలాగ్ పై పంచ్ లు వేశారు. సీఎం రేవంత్ రోజుకు 18 గంటలు .. కొండల్ రెడ్డి కొండలు ఎలా కొల్లగొట్టాలి?.. తిరుపతి రెడ్డికి భూములు గుంజుకొని ఎలా ఇవ్వాలి?.. అల్లుడికి ఆస్తులు ఎలా ఇవ్వాలి?.. జగదీశ్వర్ రెడ్డికి ఆస్తులు ఎలా ఇవ్వాలి?.. ఇలా నీ ఫ్యామిలీని అదాని కుటుంబం కంటే పెద్దది ఎలా చేయాలనే ఎజెండాలో నువ్వు పని చేస్తున్నావ్ అంటూ కేటీఆర్ ఏకీపారేశారు.
మన భారతదేశంలో దాదాపు 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఇంటింటికి తాగునీరుతో సహా ప్రతి ఎకరాకు సాగు నీరు ఇచ్చేందుకు 40 వేల టీఎంసీలు చాలన్నారు. కానీ 80 ఏళ్లు అయినా నీటిని వాడుకునే తెలివి, ప్రణాళిక పాలకులు లేకపోవడంతో బాధాకరమన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చేందుకు.. 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్ కెపాసిటీ మన దేశానికి ఉందన్నారు. కానీ పాలకుల అసమర్థత వల్ల మహానగరాలు సైతం కరెంట్ కోతలతో అల్లాడిపోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
1980ల్లో చైనా కన్నా భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదని, కానీ ఇప్పుడు చైనా జీడీపీ 20 మిలియన్ డాలర్ల పైన ఉంటే.. 3.4 ట్రిలియన్ డాలర్ల వద్దే భారత్ ఆగిపోయిందన్నారు. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. పాలకుల అసమర్థత వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడట్లేదన్నారు. మతం మత్తులో మనం వెనుకబడితే.. చైనా లాంటి దేశాలు ప్రపంచంతో పోటీ పడుతూ ఎక్కడిపోకో వెళ్లాయన్నారు.
ఎన్నికల ముందు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండని, కానీ ఇప్పుడు ఉన్నది కూడా ఊడగొట్టిండని పేర్కొన్నారు. సీఎంకి కౌంటర్ దాఖలు చేసే టైం కూడా లేదన్నారు. కేసీఆర్ 15 మందిల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిండని.. 14 లక్షల మందికి కేసీఆర్ కిట్ ఇచ్చిండని గల పాలనను గుర్తు చేశారు.
Read more: CM Revanth Reddy: కొంత మంది అఘోరా పూజలు చేశారు.!. బీఆర్ఎస్ టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..
బీజేపీ ఎప్పుడూ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అని చెప్తుంటుందని, కానీ.. తెలంగాణలోని మా సింగర్ ఇంజినే మీ డబుల్ ఇంజిన్ కన్నా ఎక్కువ మోత మోగించిందన్నారు. దమ్ముంటే.. మా కన్నా మెరుగ్గా పని చేసిన మీ డబుల్ ఇంజిన్ రాష్ట్రం చూపించగలరా? అంటూ ఫైర్ అయ్యారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే.. బీజేపీ సర్కార్ లేని రాష్ట్రాలకు వెన్నుపోటు పొడుస్తుందని కేటీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




